ఇద్దరికి ఓకే అయితే శృంగారం షూట్‌ చేయడం తప్పు కాదంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు

పోర్నోగ్రఫీపై వివాదాస్పద, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోర్నోగ్రఫీ తప్పుకాదని, ఇద్దరికి ఇష్టమైతే దాన్ని షూట్‌ చేయడం తప్పు కాదని షాకింగ్‌ కామెంట్స్ చేశారు. దీంతో ఇప్పుడిది వైరల్‌ అవుతుంది. 
 

శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా పోర్న్‌ వీడియోల చిత్రీకరణలో కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడీ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. వెబ్‌ సిరీస్‌లు, సినీ అవకాశాలంటూ అమ్మాయిలకు ఎరవేసి వారిచే బలవంతంగా రాజ్‌కుంద్రా టీమ్‌ పోర్న్ వీడియోలు చిత్రీకరించారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు.
తాజాగా దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ షాకింగ్‌ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో శృంగారమే బంగారమని తెలిపారు. సెక్స్ చాలా కాస్ట్లీ అయిపోయిందనే విషయాన్ని పరోక్షంగా చెప్పారు. అదే సమయంలో చాలా విలువైనదని వెల్లడించారు.

ఇద్దరికి(ఆడ, మగ) ఇష్టమైనప్పుడు సెక్స్ లో పాల్గొనడం తప్పు కాదని, ఆ ఇద్దరికి ఓకే అయితే దాన్ని షూట్‌ చేయడం కూడా తప్పు కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. టోటల్‌గా పోర్నోగ్రఫీనే తప్పు కాదని చెప్పిన వర్మ, ఇష్టం లేకుండా బలవంతంగా చేస్తే తప్పు అని తెలిపారు. దీంతో వర్మ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. `ఎక్స్ ఎక్స్ ఎక్స్` గురించి చెబుతూ, ఇందులో సింగిల్‌ ఎక్స్, డబుల్‌ ఎక్స్, త్రిబుల్‌ ఎక్స్ ఉంటాయన్నారు. సింగిల్‌ ఎక్స్ అంటే కొంచెం అని, డబుల్‌ ఎక్స్ అంటే కాస్త ఎక్కువ అని, త్రిబుల్ ఎక్స్ అంటే పూర్తి స్థాయి సెక్స్ అని చెప్పారు. ఈ సందర్భంగా తన వీడియో లైబ్రరీ రోజుల విషయాలను పంచుకున్నారు.

Ram Gopal Varma

యూట్యూబ్‌లోని పోర్న్ వీడియోలపై స్పందిస్తూ, యూట్యూబ్‌లో వేల పోర్న్ వీడియోలు ఉన్నాయని, అవన్నీ బయటకు తీస్తే చాలామందిని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. రాజ్ కుంద్రా అనేవాడు శిల్పా శెట్టి భర్త, పైగా ప్రముఖ వ్యాపారవేత్త కాబట్టి ఈ ఇష్యూ బాగా హైలైట్ అవుతుంది తప్ప ఇంకేమీ లేదన్నారు.
పోర్న్ షూట్ చేయడానికి, దాన్ని వేరే వాళ్లకు చూపిస్తూ బిజినెస్ చేయడానికి చాలా తేడా ఉందన్న వర్మ, ఓటీటీ వల్లనే చెడిపోతున్నారని చెప్పడం తప్పు.. ఇష్టం ఉంటే చూడండి.. లేకపోతే ఓటీటీ చూడకండి అంతే. పోర్న్ చూడటం వల్ల సమాజానికి నష్టం జరగదని వర్మ తెలిపారు. పోర్నోగ్రఫి చూసినంత మాత్రాన సమాజంలో దారుణాలు జరుగుతాయని అనుకోవడం తప్పు అని ఆయన అన్నారు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మార్పులు వస్తున్నాయని, వాటినే మనం ఫాలో అవుతున్నామని తెలిపారు.

Latest Videos

click me!