హీరోయిజం కి కొత్త అర్థం చెప్పిన దర్శకుల్లో పూరి జగన్నాధ్ ఒకరు. టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ అనొచ్చు. ఆయన తెరకెక్కించిన బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి, పోకిరి ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచాయి. అయితే పూరి కొన్నాళ్లుగా తన మార్క్ కోల్పోయాడు. వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్నారు.