రష్మిక - విజయ్ న్యూ ఇయర్ కలిసే సెలబ్రేట్ చేసుకున్నారా? వైరల్ అవుతున్న వీడియో!

First Published | Jan 5, 2023, 10:19 AM IST

నేషనల్ క్రష్ రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారంటూ నిత్యం రూమర్లు పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను కూడా కలిసే జరుపుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
 

‘గీతాగోవిందం’ చిత్రంతో విజయ్,  రష్మిక తొలిసారిగా వెండితెరపై అలరించారు. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవడంతో మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.  హిట్ పెయిర్ తో ఆ వెంటనే ‘డియర్ కామ్రేడ్’రూపొందించిన విషయం తెలిసిందే.  ఈ రెండు చిత్రాలు కొనసాగే క్రమంలోనే ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ కూడా షురూ అయ్యిందని ప్రచారం జరుగుతోంది.
 

ఈ క్రమంలో టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నేషనల్ క్రష్ రష్మిక మందన్న డేటింగ్ లో ఉన్నారంటూ ఎప్పటి నుంచో ఇంటర్నెట్ లో పుకార్లు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు వీరి ప్రేమ కహానీకి కొన్ని హింట్స్ కూడా ఇస్తున్నట్టు అనిపిస్తోంది.


ఇప్పటికే బెంగళూరులోని ఓ రీసార్ట్ లో కలిశారని,  పలు హోటళ్లకు కలిసే వెళ్తున్నారంటూ పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత గతేడాది చివర్లో మాల్దీవులకు వేకేషన్ కోసం వెళ్లారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. పొగలేనిదే మంట రాదనట్టు వీరి మధ్య లవ్ ట్రాక్ లేనిదే ఇంతలా రూమర్లు ఎందుకొస్తాయని అంటున్నారు. 
 

ఇక తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసే చేసుకున్నారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా రష్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో లైవ్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా తన అభిమానులకు విషెస్ తెలిసింది. 
 

అయితే,  లైవ్ సెషన్‌లో తన అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వచ్చింది. అదే సమయంలో రష్మిక వాయిస్ తో పాటు విజయ్ దేవరకొండ వాయిస్ కూడా వినిపిస్తుందని అభిమానులు, నెటిజన్లు అంటున్నారు. సంబంధించిన  వీడియోను నెట్టింట వైరల్ చేస్తున్నారు. దీంతో వీరిద్దరూ న్యూ ఇయర్ కలిసే సెలబ్రేట్ చేసుకున్నారని అభిప్రాయపడుతున్నారు. 
 

ఇక గతేడాది మాల్దీవులకు వెళ్లినప్పుడు కూడా విజయ్, రష్మిక పంచుకున్న కొన్ని ఫొటోలు, అక్కడి వెదర్ వీరిద్దరూ కలిసే ఉన్నట్టు చెబుతున్నాయి. ఆ పిక్స్ కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేరీర్ విషయానికొస్తే.. రష్మిక ‘వారసుడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకురానుంది. ‘లైగర్’ తర్వాత విజయ్ దేవరకొండ ‘ఖుషి’లో నటిస్తున్నారు. 
 

Latest Videos

click me!