కొన్ని రోజులకే బాగా కనెక్ట్ అయ్యావంటూ స్టేజ్‌పైనే అఖిల్‌కి గట్టిగా హగ్‌ ఇచ్చిన `ఢీ` భామ సుస్మిత.. హాట్‌ టాపిక్

Published : Apr 01, 2022, 10:50 AM IST

`ఢీ` షో కూడా లవ్‌ స్టోరీలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. తాజాగా బిగ్‌బాస్‌ ఫేమ్‌ అఖిల్‌ సార్థక్‌కి మరో అమ్మాయి ఫిదా అయిపోయింది. ఆయన్ని హగ్‌ చేసుకుని ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 

PREV
16
కొన్ని రోజులకే బాగా కనెక్ట్ అయ్యావంటూ స్టేజ్‌పైనే అఖిల్‌కి గట్టిగా హగ్‌ ఇచ్చిన `ఢీ` భామ సుస్మిత.. హాట్‌ టాపిక్

`బిగ్‌బాస్‌ 4`లో రన్నరప్‌గా నిలిచిన అఖిల్‌ సార్థక్‌ ప్రస్తుతం `ఢీ` 14 సీజన్‌లో సందడి చేస్తున్నారు. ఆయన కింగ్స్ టీమ్‌కి లీడర్‌గా ఉన్నారు. హైపర్‌ ఆదితో తనదైన స్టయిల్‌లో కామెడీ చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. ఇందులో భాగంగా లేటెస్ట్ ప్రోమో విడుదలై వైరల్‌ అవుతుంది. ఇందులో `బిగ్‌బాస్‌ 4` ఫేమ్‌, అఖిల్‌ బెస్ట్ ఫ్రెండ్‌ సోహైల్‌ గెస్ట్ గా పాల్గొనడం విశేషం. దీంతో మరోసారి వీరిద్దరు కలిసి స్టేజ్‌పై రచ్చ చేశారు. డాన్సులతో ఇరగదీశారు.సోహైల్‌ కథ వేరే ఉంటదని, బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ని గుర్తు చేశారు. 
 

26

మరోవైపు ఇందులో అఖిల్‌ మెలోడీ సాంగ్‌ ఆలపించారు. బిగ్‌బాస్‌లోనూ ప్రేమ పాటలతో, ప్రేమ కథలతో మోనల్‌ని పడేశాడు అఖిల్‌. ఇప్పుడు అదే పంథాని అవలంభిస్తున్నాడు. లేటెస్ట్ ప్రోమోలో ఆయన `కొత్త బంగారు లోకం` చిత్రంలోని లవ్‌ సాంగ్‌ని ఆలపించారు. బేసిక్‌గా అఖిల్‌ మంచి సింగర్‌ అనే విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి అద్భుతంగా పాట పాడి అందరిని ఫిదా చేశాడు. 

36

అయితే అందులో క్వీన్స్ టీమ్‌ లీడర్‌గా ఉన్న సుస్మిత అనాల సైతం ఫిదా అయ్యింది. ఆమె ఎంతగా ఫిదా అయ్యిందంటే అఖిల్‌ పాట అయిపోయాక స్టేజ్‌పైకి వచ్చిన తన ఫీలింగ్‌ని పంచుకునేంతగా మైమరచిపోయింది. అంతటితో ఆగలేదు. అఖిల్‌కి, సుస్మితకి మధ్య హగ్‌ల వరకు వెళ్లింది. 

46

అఖిల్‌ పాట అయిపోగానే తన సీట్లో నుంచి స్టేజ్‌పైకి వచ్చింది సుస్మిత. `కొన్ని వీక్స్ కలిసి ఉన్నా సరే చాలా కనెక్ట్ అయిపోయావ్‌ నువ్వు నాకు` అంటూ బాంబ్‌ పేల్చింది. దీంతో షోలో పెద్ద అరుపులు స్టార్ట్ అయ్యాయి. సుస్మిత మాటలకు అందరు హోరెత్తించారు. అఖిల్‌ సైతం ఆనందంలో మునిగిపోయాడు. 

56

అంతటితో ఆగలేదు సుస్మిత. అఖిల్‌కి దగ్గరకి వచ్చి హగ్‌ చేసుకునే సిగ్నల్‌ ఇచ్చింది. ఆమె ఎక్స్ ప్రెషన్‌కి మరింతగా ఫిదా అయిన అఖిల్‌ సైతం వెళ్లి సుస్మితని గట్టిగా హగ్‌ చేసుకున్నారు. దీంతో మరింతగా హోరెత్తిపోయింది ఢీ షో. జడ్జ్ లు ప్రియమణి, నందిత శ్వేత, గణేష్‌ మాస్టర్‌, యాంకర్‌ ప్రదీప్‌, హైపర్‌ ఆది, సోహైల్‌ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేయగా, ప్రస్తుతం ఈ సన్నివేశాలు `ఢీ` లేటెస్ట్ ప్రోమోలో వైరల్‌ అవుతుండటం విశేషం. 

66

అఖిల్‌ ఇప్పటికే ఓ లవ్‌ స్టోరీని కంటిన్యూ చేస్తున్నాడు. `బిగ్‌బాస్‌ 4`లో ఆయన నటి మోనాల్‌తో పులిహోర కలిపారు. వీరిద్దరు తమ ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నారు. అంతేకాదు కలిసి `తెలుగు అబ్బాయి గుజరాతీ అమ్మాయి` పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు మరో అమ్మాయి ఫిదా కావడం విశేషంగా చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories