Devatha: మాధవను జాగ్రత్తగా చూసుకోమని రాధకు చెప్పిన దేవి.. కుమిలిపోతున్న రుక్మిణి!

Published : Jun 17, 2022, 10:50 AM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 17 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Devatha: మాధవను జాగ్రత్తగా చూసుకోమని రాధకు చెప్పిన దేవి.. కుమిలిపోతున్న రుక్మిణి!

 ఈరోజు ఎపిసోడ్ లో దేవి, చిన్మయి ని చూసి భాగ్యమ్మ ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడు భాగ్యమ్మ పిల్లలతో మాట్లాడుతూ నేను రోజు ఇక్కడే ఉంటాను. మీరు వచ్చి నాతో మాట్లాడి నా దగ్గర కాయలు తీసుకొని వెళ్ళింది అని అనడంతో వెంటనే దేవి అయితే ప్రతి రోజూ మీ దగ్గరికి వస్తాను అని అనడంతో భాగ్యమ్మ ఆనందం వ్యక్తం చేస్తుంది. దూరం నుంచి అదంతా చూస్తున్న రాధ ఆనంద పడుతూ ఉంటుంది.
 

26

ఆ తర్వాత పిల్లలు టైం అవుతుంది అని చెప్పి వెళ్లిపోవడంతో వెంటనే రాధ అక్కడికి వచ్చి ఏంటమ్మా ఇది నువ్వు ఇలా కాయలు అమ్ముడేంది అని అడుగుతుంది. అప్పుడు భాగ్యమా మరి ఏం చేస్తావ్ రుక్మిణి కమలను విడిచిపెట్టి వచ్చేస్తాను ఇంట్లో ఒంటరిగా ఉంటే ఎలానో ఉంది అందుకే ఇలా వ్యాపారం చేస్తూ నా మనవరాలు కళ్ళెదురుగా చూసుకోవచ్చు అని ఇక్కడికి వచ్చాను అని అనడంతో ఆ మాటకు రా రాధ ఎమోషనల్ అవుతుంది.
 

36

ఆ తర్వాత రాధ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరొకవైపు కమల,భాష రుక్మిణి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు కమలా ఒకవేళ రుక్మిణి బతికే ఉంటే ఇన్ని రోజులు ఇక్కడికి రాకుండా ఎందుకు ఉంటుంది అని బాధపడుతూ ఎమోషనల్ అవుతుంది. అప్పుడు భాషా నిదానంగా ఆలోచిస్తూ రుక్మిణి బతికే ఉంది అని పటేలకు తెలుసు అని నాకు అనిపిస్తుంది అని అనడంతో అప్పుడు కమల గతంలో భాగ్యమ్మ అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటుంది.
 

46

అలా వారిద్దరూ రుక్మిణి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. మరొకవైపు భాగ్యమ్మ స్కూల్లో పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే ఆదిత్య అక్కడికి రావడంతో పక్కకు వెళ్లి దాక్కుంటుంది. పిల్లలు స్కూల్ అయిపోగానే ఆఫీసర్ అంకుల్ అంటూ వచ్చి ఆదిత్యను కౌగిలించుకుంటారు. ఆ తర్వాత ఆదిత్య కోసం జామ పండ్లను కోసి ఇస్తారు.
 

56

అలా వారు ముగ్గురు మాట్లాడుతూ ఉండగా అది చూసి భాగ్యమ్మ సంతోష పడుతూ ఉంటుంది. ఇంతలోనే మాధవ అక్కడికి రావడంతో మాధవని చూసిన భాగ్యమ్మ కోపంతో రగిలి పోతూ ఉంటుంది. ఆదిత్య పిల్లలతో మాట్లాడుకుంటూ పిల్లలతో సరదాగా గడుపుతూ ఉండగా ఇంతలో చిన్మయి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అప్పుడు ఆదిత్య దేవి మన ఇంటికి వెళదామా అని అడగడంతో సరే అని అంటుంది.
 

66

ఇంతలోనే మాధవ వచ్చి ఆదిత్య దేవి వాళ్ళవైపు చూస్తూ నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసిన దేవికి నిన్ను దగ్గర కానివ్వను అని అనుకుంటూ ఉంటాడు మాధవ అప్పుడు మాధవ పిలవడంతో దేవి అక్కడ నుంచి వెళ్లి పోతుంది.  మాధవ పై దేవి ప్రేమని చూపించడంతో మాధవ మరింతగా రెచ్చిపోతాడు. ఇక రేపటి ఎపిసోడ్ ఎపిసోడ్ లో దేవి వెళ్లి రాధని ప్రశ్నిస్తూ మమ్మల్ని అందరినీ బాగానే చూసుకుంటావు కానీ నాన్న ఎందుకు పట్టించుకోవడం లేదు అని అడుగుతుంది.

click me!

Recommended Stories