`దేవర` మూడో పాట ఎలా ఉందంటే? హైలైట్స్ ఇవే, కానీ ఆ విషయంలో ఫ్యాన్స్ డిజప్పాయింట్‌?

First Published Sep 4, 2024, 6:36 PM IST

`దేవర` మూడో పాట `దావూదీ` విడుదలైంది. అయితే ఇందులో ఫ్యాన్స్ డిజప్పాయింట్‌ అయ్యే అంశమేంటి? హైలైట్స్ ఏంటనేది చూద్దాం.
 

ఎన్టీఆర్‌ సోలో పాన్‌ ఇండియా మూవీ `దేవర`. సామాజిక బాధ్యత కలిగిన దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్న చిత్రమిది. ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీతోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. 

వీరితోపాటు బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతుంది. ఈ నెలలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. 

బిగ్ బాస్ తెలుగు 8 - ఏసియా నెట్ తెలుగు పోల్

రిలీజ్‌కి దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచింది టీమ్‌. ఇప్పటికే `దేవర` సినిమా నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. గ్లింప్స్ వచ్చింది. విడుదలైన రెండు పాటలు ఆకట్టుకున్నాయి. టైటిల్ సాంగ్స్ గూస్‌ బంమ్స్ తెప్పించేలా ఉంది.

ఆ తర్వాత విడుదలైన రొమాంటిక్‌ సాంగ్‌ ఆకట్టుకుంది. ఎన్టీఆర్‌ ని ఈ యాంగిల్‌లో ఎప్పుడూ చూడలేదనేలా దాన్ని డిజైన్‌ చేశారు. రొమాన్స్ విషయంలో రెచ్చిపోయారు తారక్‌. ఈ పాట బాగానే వెళ్లింది. కానీ హంటింగ్‌ చేసే స్థాయిలో లేకపోవడం గమనార్హం. 
 

Latest Videos


ఇప్పుడు మూడో పాట వచ్చింది. `దావూదీ` అంటూ సాగే ఈ పాట సెట్‌లో చిత్రీకరించారు. మంచి కలర్‌ ఫుల్‌ సెట్‌లో దీన్ని ఓ స్పెషల్‌ సాంగ్‌గా డిజైన్‌ చేశారు. సెట్‌ వర్క్ మాత్రం అద్బుతంగా ఉంది. కలర్ఫుల్‌గా ఉండి పాటలో హైలైట్‌ అవుతుంది. ప్రకృతిని ప్రతిబింబించేలా ఉండటం విశేషం.

అదే సమయంలో ఎన్టీఆర్‌, జాన్వీ కపూర ధరించిన కాస్ట్యూమ్‌ కూడా బాగానే ఉంది. ఈ పాటలో ఇవే హైలైట్‌గా నిలిచాయి. 
 

దీనికితోడు ఎన్టీఆర్‌ డాన్సులు హైలైట్‌గా చెప్పొచ్చు. పాట మొత్తానికి స్పెషల్‌ ఎట్రాక్షన్‌ అని చెప్పాలి. గత రెండు పాటల్లో ఎన్టీఆర్‌ డాన్స్ చేసేందుకు స్కోప్‌ లేదు. రెండో పాటలో ఉన్నా, అది సరిపోలేదు. దీంతో `దావూదీ` పాటలో మాత్రం రెచ్చిపోయాడు. పాత ఎన్టీఆర్‌ని చూపించాడు తారక్‌.

ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఆ డాన్స్ ఉంది. అయితే తారక్‌ని జాన్వీ కపూర్‌ బ్యాలెన్స్ చేయలేకపోయింది, ఆయన ముందు డాన్సుల్లో తేలిపోయింది. అందుకే ఎన్టీఆర్‌ని స్పెషల్‌గా సింగిల్‌గా ఉంచి డాన్స్ చేయించారు. కొన్ని చోట్ల మాత్రం జాన్వీ అదరగొట్టిందని చెప్పొచ్చు. 
 

ఇక ఈ పాటలో ప్రధాన మైనస్‌ ఏంటంటే అది ట్యూన్‌. ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. ఆశించిన స్థాయిలో లేదు. ఫాస్ట్ గా డాన్స్ చేసేందుకు ఉపయోగపడేద తప్పితే, ఆడియెన్స్ ని హంట్‌ చేసేలా ఈ పాట లేకపోవడం బిగ్గెస్ట్ మైనస్‌.

ఈ మూవీకి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాటని రామజోగయ్య శాస్త్రి రాయగా, నకాష్‌ అజీజ్‌, ఆకాశ ఆలపించారు. 
 

సముద్రపు తీర ప్రాంతంలోని ఓ గ్రామంలో జరిగేకథ ఇది అని తెలుస్తుంది. భయం అంటే తెలియని వాళ్లకి భయాన్ని పరిచయం చేసేలా హీరో పాత్ర ఉంటుందని దర్శకుడు కొరటాల శివ వెల్లడించారు. ఆయన గత చిత్రం `ఆచార్య` డిజప్పాయింట్‌ చేయడంతో దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

క్వాలిటీ విషయంలో తగ్గకుండ రూపొందించారని సమాచారం. ఇందులో తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్‌ తండ్రి కొడుకులుగా కనిపిస్తారట. తండ్రి నిర్మించిన పోర్ట్ ని విలన్లు ఆక్రమించుకుంటే, కొడుకు వాళ్లని ఎదుర్కొని ఎలా తన సొంతం చేసుకున్నాడనేది కథగా `దేవర` ఉందబోతుందని సమాచారం. కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని నిర్మించిన ఈ మూవీ సెప్టెంబర్‌ 27న విడుదల కాబోతుంది. 
 
 

click me!