అందంగా చీరకట్టి.. ఊరించే పెదవులతో మైమరిపిస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్.. జాన్వీ కపూర్ బ్యూటీఫుల్ లుక్

First Published | Jul 10, 2023, 12:56 PM IST

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ప్రస్తుతం పలు హిందీ చిత్రాలతో పాటు సౌత్ ఫిల్మ్స్ పైనా ఈ ముద్దుగుమ్మ ఫోకస్ పెట్టింది. ఇక ఎన్టీఆర్ సరసన ‘దేవర’లో నటిస్తున్న విషయం తెలిసిందే. 
 

అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  వెండితెరకు పరిచయం అయ్యింది. బాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. సినిమాల పరంగా గతంలో జోరు లేకున్నా క్రేజ్ పెంచుకుంటూనే వచ్చింది. ప్రస్తుతం జాన్వీ  వరుస చిత్రాలతో బిజీగా ఉంది.
 

ప్రస్తుతం జాన్వీ  నాలుగు చిత్రాల్లో నటించింది. అవి విడుదల కావాల్సి ఉన్నాయి. హిందీలో ‘ఉలజ్’ సినిమాలు చిత్రీకరణలో ఉండగా.. మరో రెండు సినిమాలు ‘బావల్’, ’మిస్టర్ అండ్ మిస్ మహి’ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 
 


ఇక టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతోనే సౌత్ ఆడియెన్స్ ను పలకరించనుంది. ఎప్పటినుంచో ఆడియెన్స్  కూడా ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తానికి వచ్చే ఏడాది వెండితెరపై దక్షిణాది ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధవుతోంది. 

ఇదిలా ఉంటే.. జాన్వీ  సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. గతంలో ఈ ముద్దుగుమ్మ నెట్టింట అడుగుపెట్టిందంటే.. అందాల జాతరతో మతులు పోగొట్టేది. గ్లామర్ విందులో అప్పట్లోనే హద్దులు దాటేసింది. ఇక తాజాగా మాత్రం జాన్వీ  రూటు మార్చుకుంది. కాస్తా పద్ధతిగా మెరుస్తూ ఆకట్టుకుంటోంది. 

తాజాగా గ్రీన్ శారీలో ఫ్యాన్స్ కు దర్శనమిచ్చింది. బ్లూ స్లీవ్ లెస్ బ్లౌజ్, గ్రీన్ ట్రాన్స్ ఫరెంట్ శారీలో బాలీవుడ్ బ్యూటీ మరింత అందాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు మత్తుచూపులు, ఊరించే పెదవుల అందంతో కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంది. బ్యూటీఫుల్ గా చీరకట్టి చూపుతిప్పుకోకుండా చేసింది. 
 

ఇప్పుడు ‘బావల్’ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ  ఇలా దర్శనమిచ్చింది. తర్వలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్స్ లో జాన్వీ బిజీగా ఉంది. ఈ సందర్భంగా చీరకట్టులో ప్రచార కార్యక్రమాలకు హాజరవుతోంది. ఇక తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలను ఫ్యాన్స్ , నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

Latest Videos

click me!