రానా ‘అరణ్య’ మూవీ రివ్యూ

First Published | Mar 26, 2021, 6:35 AM IST

 జంతువులను కాపాడకపోతే ప్రకృతి సంక్షోణం వచ్చేస్తుంది. బాలెన్స్ తప్పిపోతుంది. చివరకి మనిషి మనుగడ కూడా సాధ్యం కాదు. ఈ విషయాలను ఇలాగే చెప్తే ఓ సైన్స్ పాఠం లాగ ఉంటుంది. కానీ సినిమాగా ఓ ఎంటర్టైన్మెంట్ గా చెప్తే ...మన బుర్రలకు ఎక్కుతుందేమో..అదే ప్రయత్నం  ‘అరణ్య’ సినిమా చేసింది.

అరబ్బు, ఒంటె కథ తెలిసిందే. ఒంటె మొదట అరబ్బు గుడారంలో తల దూరుస్తానంటుంది. ఆ తరువాత కొంచెం కొంచెంగా చొరబడి అరబ్బును బయటకు గెంటేస్తుంది. అలాగే మనిషి కంటే ముందే జంతువులు భూమి మీద జీవించాయని సైన్స్‌ చెబుతోంది. అంటే ఈ భూమి నిజానికి వాటిదే. వాటిని మచ్చిక చేసుకుని మనం షేర్ చేసుకుంటున్నాం. ఒంటె కథలాగ మెల్లి మెల్లిగా భూమిని ఆక్రమించి..జంతువులను ఈ భూమి మీద నుంచి బయిటకు గెంటేస్తున్నాం. అంటే చంపేస్తున్నాం. ఈ జంతువులను కాపాడకపోతే ప్రకృతి సంక్షోణం వచ్చేస్తుంది. బాలెన్స్ తప్పిపోతుంది. చివరకి మనిషి మనుగడ కూడా సాధ్యం కాదు. ఈ విషయాలను ఇలాగే చెప్తే ఓ సైన్స్ పాఠం లాగ ఉంటుంది. కానీ సినిమాగా ఓ ఎంటర్టైన్మెంట్ గా చెప్తే ...మన బుర్రలకు ఎక్కుతుందేమో..అదే ప్రయత్నం ‘అరణ్య’ సినిమా చేసింది. ఆ ప్రయత్నం ఎంతవరకూ ఫలించింది. అసలు ‘అరణ్య’ కథేంటి..రానా పాత్రేమిటి...సినిమా అందరూ చూడగలిగేటట్లే ఉందా..లేక మెసేజ్ ల మయంగా ఉందా...వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి...ఫారెస్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా జాదవ్‌ స్పూర్తితో తయారైన ఈ కథలో...అడవి అన్నా, వన్య ప్రాణులు, ముఖ్యంగా ఏనుగులు అంటే ప్రాణంగా బ్రతుకుతున్న వ్యక్తి నరేంద్ర భూపతి అలియాస్ అరణ్య(రానా దగ్గుబాటి). పక్షులతో వాటి భాషలోనే మాట్లాడుతూ...ఏనుగులును పేరు పెట్టి పిలుస్తూ , అటవీ జాతుల వారుతో సఖ్యంగా ఉంటూ ప్రశాంతంగా అడవిలో తానూ ఒకడినై బ్రతుకుతూంటాడు అరణ్య. తన తాతలు 500 ఎకరాల అటవీ ప్రాంతాన్ని ప్రభుత్వానికి రాసిచ్చేస్తే, ఆ అడవిలోనే పెరిగి, అక్కడి ఏనుగులకు, అడవికి 40 ఏళ్లుగా సంరక్షకుడిగా ఉంటూంటాడు. అలాగే లక్షకి పైగా చెట్లు నాటినందుకు గాను రాష్ట్రపతి చేత ఫారెస్ట్ మాన్ అఫ్ ఇండియా అవార్డు అందుకుంటాడు అరణ్య. అంతా సవ్యంగా నడుస్తున్న సమయానికి అటవీ శాఖ మంత్రి కనకమేడల రాజగోపాలం(అనంత్ మహదేవన్) ఆ అడవిలో 60 ఎకరాల్లో డీఆర్‌ఎల్‌ ఒక టౌన్‌షిప్‌ కట్టాలని ప్లాన్ చేస్తాడు. అది అతని లైఫ్ యాంబిషన్. ఆ పని మొత్తం ఓ కాంట్రాక్టర్ కు అప్పగిస్తాడు. ఆ కాంట్రక్టర్ ఓ లాయిర్ సాయంతో కొన్ని దొంగ పత్రాలు సృష్టించి అక్కడ పని ప్రారంభిస్తాడు.

విషయం తెలుసుకున్న అరణ్య...డిల్లీ వెళ్లి అక్కడ కోర్ట్ లో తమ వారసత్వ భూమిగా వచ్చిన ఆ అడవిని సంభందించిన సాక్ష్యాలు అందించి గెలిచి ఆ కడ్డటం ఆపు చేస్తారు. అయితే మినిస్టర్ రాజగోపాలం ఆషామాషీ మనిషి కాదు. తన లాయిర్ సలహాతో కోర్టు తీర్పుని థిక్కరించామని కేసు పెట్టినా తేలేసరికి ఓ పదిహేను,ఇరవై సంవత్సరాలు పడుతుందని అర్దం చేసుకుని మళ్లీ పని మొదలెడతాడు. అయితే ఈ సారి తెలివిగా తమ పనికి ఏనుగులు,కాని అరణ్యకాని అడ్డు రాకుండా తొలిగించుకోవాలనుకుంటాడు. అరణ్యని రెచ్చగొట్టి ఫారెస్ట్ ఆఫీసర్ పై దాడి చేసేలా చేసి, కోర్టుకు పంపి మానసిక స్దితి సరిగ్గా లేదని వాదించి నిరూపించి జైలుకు పంపుతారు. మరో ప్రక్క అరణ్యతో ఉండే ఏనుగులు తమ కట్టడాల వైపు రాకుండా ఉండటం కోసం పెద్ద గోడ కట్టిస్తాడు. ఈ పరిస్దితుల్లో అరణ్య ఎలా పోరాటం చేసాడు..జైలు నుంచి బయిటకు వచ్చాడ.... ఆ మంత్రికి ఎదురుతిరిగాడా? అడవిని, అందులోని ఏనుగులను అరణ్య ఎలా కాపాడాడు? అన్నదే మిగతా కథ.
స్క్రిప్టు ఎనాలసిస్...ఏనుగుల కోసం పోరాడటం, ఏనుగుల గళం వినిపించడమే ఈ ‘అరణ్య’ కథాంశం. ఏనుగులు గోడను కూల్చడం (ఎలిఫెంట్‌ వార్‌) ఆధారంగా రాసుకున్న స్ర్కిప్టు ఇది. అయితే ఆ కథాంశానికి ఉప కథలు అడ్డు తగిలాయి. అడవి, వన్యప్రాణుల కోసం పాటు పడే వ్యక్తి కథగా చెప్తే అది డాక్యుమెంటరీ అయ్యిపోతుందని భయపడ్డారో ఏమో కానీ విష్ణు విశాల్ పాత్రను తీసుకొచ్చి చిన్న లవ్ స్టోరీ టచ్ ఇచ్ద్దామని ప్రయత్నం చేసారు. ఫస్టాఫ్ మొత్తాన్ని ఆ ఎపిసోడ్...విసుగు తెప్పించింది. కథకు ఉపయోగపడని ఎపిసోడ్. అందులోనూ నక్సలైట్ పాత్రలు పెట్టారు. అవీ కథలో ఏ మాత్రం ఉపయోగపడవు. వాటికి సరైన ముగింపు లేదు. ఆ రెండు ఎపిసోడ్స్ తీసేస్తే సినిమా చక్కగా నడిచిపోయేది. అలా చేయకపోవటంతో ఫస్టాఫ్ లో సీన్స్ కొంత గందరగోళానికి గురి చేసాయి. విష్ణు విశాల్ పాత్రను ఎడిటింగ్ తీసేసారో ఏమో కానీ ముగింపి అర్దాంతరంగా ఉంది. మిగతాదంతా బాగుంది. కాంప్లిక్ట్ లోనికి సినిమా ప్రారంభంలోనే ఎంటరైనా,రానా జైలుకు వెళ్లేదాకా కథ ఊపందుకోలేదు. సెకండాఫ్ లో రానాకి, ఏనుగులుకు మద్య దూరం ఏర్పడటం దగ్గర సినిమా లో కాంప్లిక్ట్స్ పీక్స్ కు వెళ్లింది.
అందుకే అక్కడ నుంచి సినిమా చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. చివరి ఇరవై నిముషాలే సినిమాకు ప్రాణం. ఆ ఎపిసోడ్ మొత్తం బాగా పండింది. అయితే ఎంత చేసినా ఈ సినిమాను ఎమోషనల్‌గా ఇంకాస్త కనెక్ట్ చేసి ఉంటే బాగుండేది. స్క్రీన్ ప్లేనే మరింత జాగ్రత్తగా డిజైన్ చేసుకుంటే ఈ సమస్య వచ్చేది కాదు. అలాగే రొటీన్ పార్మెట్ లోకు వెళ్లి ముందు హీరోకు అడవంటే ఎంత ప్రాణమో చూపించే ఎపిసోడ్స్ , ఆ తర్వాత అడివిలో ఓ పాట వేసి మెల్లిగా విలన్స్ ఇంట్రీ ఇవ్వటం కాకుండా స్ట్రైయిట్ గా కథలోకి పరుగెత్తించారు. ఆ విషయంలో డైరక్టర్ ని మెచ్చుకోవాలి. అలాగే ఈ సినిమాలో మావోయిస్టులు, నక్సలైట్ల గురించి అంతగా ప్రస్తావించలేదు. ప్రస్తావిస్తే అది వేరొక కథ అయ్యిపోయేది. అసలు నక్సలైట్స్ ఎపిసోడ్ తీసేసినా కథకు వచ్చే నష్టం వన్ పర్శంట్ కూడా లేదు.
దర్శకత్వం , మిగతా విభాగాలు:డైరక్టర్ ప్రభు సాల్మ్ కు ఇలాంటి కథలు కొత్తేమీ కాదు. గతంలో ‘కుంకి’ (తెలుగులో గజరాజు) సినిమా డైరక్ట్ చేసారు. అదీ ఇలాగే అడవి, ఏనుగు చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ సినిమాలో వాస్తవ సమస్యను పూర్తిగా చూపించే ప్రయత్నం చేసారు. అలాగే ఇశా ఫౌండేషన్ కోసం ఎలిఫెంట్ కారిడార్ ధ్వంసం విషయాన్ని ఇండైరక్ట్ గా చూపించారు. ఇషా ఫౌండేషన్ జగ్గీ వాసుదేవ్ లాంటి క్యారక్టర్ ని కొద్ది సేపు చూపించి మనకు గుర్తు చేస్తారు. డైరక్టర్ గా కొన్ని క్లూలు ఇచ్చి అర్దం చేసుకోవటమే మన పని అన్నట్లు వదిలేసారు.
ఇక ఈ సినిమాలో కష్టం ఎక్కువ భాగం డైరక్టర్, హీరో రానా, ఏనుగులదే. షూటింగ్ కోసం ఏనుగుల్ని ఎంపిక చేయటం, వాటికి శిక్షణ ఇవ్వటం కనపడని పని. ఇక రానా ఇప్పటిదాకా తన కెరీర్ లో అలాంటి పాత్ర పోషించలేదు. అంత విభిన్నమైన గెటప్, మ్యానరిజమ్స్. అతని వయస్సుకు అలాంటి డీగ్లామర్ పాత్ర చేయటం నిజంగా గ్రేట్. అలాగే సినిమా మరో హీరోగా కనిపించిన విష్ణు విశాల్ తన పాత్రకు న్యాయం చేశాడు. జోయా హుస్సేన్, శ్రియ పిల్లాన్కర్‌లవి చిన్న పాత్రలు. విలన్ గా చేసిన అనంత్ మహదేవన్, రవి కాలే, కమెడియన్ రఘుబాబు మెప్పించారు.
అలాగే అరణ్య సినిమాకు వెన్నుముకలా నిలిచింది మాత్రం విజువల్ ఎఫెక్ట్స్. ఆ తరువాత ఎమోషన్స్‌కు ఫెరఫెక్ట్ గా సింకైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఎక్కువ అడవుల్లోనే షూట్ చేయడంతో ఆ కష్టం ప్రతీ ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తుంటుంది. రసూల్ పూకుట్టి చేసిన సౌండ్ ఎఫెక్ట్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉన్నాయి. ఎడిటింగ్ మాత్రం అబ్ రప్ట్ గా ఉంది. అలాగే చాలా చోట్ల లాగ్ ఉంది. ఇంకాస్త పాటలు బాగోలేదు. ఎరోస్ సంస్ద ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
ఫైనల్ థాట్వచ్చే జాతీయ అవార్డ్ లలో చోటు చేసుకునే చిత్రం. ఒక వ్యక్తి ఏవిధంగా సొసైటీ మీద పాజిటివ్‌ ప్రభావాన్ని ఏ స్దాయిలో చూపగలడో భవిష్యత్‌ తరాలకు తెలియజేయాలంటే ఇలాంటి నిజ జీవిత కథలను తరుచుగా చెప్పుకుంటూ ఉండాలి.Ratign:2.755---సూర్య ప్రకాష్ జోశ్యుల
ఇంతకీ 'ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా' నిజ జీవితంలో ఎవరూ అంటే...అస్సాంకు చెందిన జాదవ్ పాయెంగ్. మజులి అనే నదిముఖ ద్వీపంలోని బీడు భూమిలో 40 సంవత్సారాల నుంచి ఒక్కొక్క మొక్క నాటడం మొదలుపెట్టాడు. నాలుగు దశాబ్ధాల పాటు ఒంటి చేత్తో కొన్ని వేల మొక్కలను నాటి ఏకంగా 550 ఎకరాల అడవిని సృష్టించాడు. గ్రామస్తులు చెట్లను నరకబోతుంటే ప్రాణాలు అడ్డుపెట్టి మరీ కాపాడాడు. ఆ అడవిలో ఏనుగులు, పులులు, జింకలు ఇంకా ఎన్నో జంతువులు ఉంటున్నాయి. దీనిని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీతో సత్కరించింది. అలాగే అమెరికాలోని బిస్టల్‌ గ్రీన్‌ హిల్స్‌ స్కూల్‌లో ఆరవ తరగతి విద్యార్ధులకు బోధించే పాఠ్యాంశాలలో జాదవ్‌ గురించి చెప్తున్నాన్నారు.
ఎవరెవరు..నటీనటులు : రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్‌ తదితరులునిర్మాణ సంస్థ : ఈరోస్‌ ఇంటర్‌నేషనల్‌ సంస్థదర్శకత్వం : ప్రభు సాల్మన్సంగీతం : శాంతను మొయిత్రాసినిమాటోగ్రఫీ : ఏఆర్ అశోక్ కుమార్ఎడిటింగ్ : భువన్ శ్రీనివాసన్డైలాగ్స్ : వనమాలివిడుదల తేది : మార్చి 26, 2021
aranya rev

Latest Videos

click me!