పవిత్ర లోకేష్ కి బై మరో నటితో సై... ఐదో బంధానికి తెరలేపిన నటుడు నరేష్?

First Published | Oct 24, 2022, 4:31 PM IST


ఈ మధ్య సినిమాల కంటే వివాదాలతోనే నటుడు నరేష్ పేరు వార్తల్లో ఉంటుంది. ఆయన వ్యక్తిగత జీవితం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతుంది. పవిత్ర లోకేష్ తో విడిపోయిన నరేష్ మరో నటికి దగ్గరయ్యారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. 
 


నటుడు నరేష్ ది అల్ట్రా మోడరన్ లైఫ్. పరిశ్రమలో పుట్టిపెరిగిన నరేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి  హీరోగా మారి  ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. అధికారికంగా మూడు వివాహాలు చేసుకున్న నరేష్, ఇటీవల నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నట్లు ప్రకటించారు. 

పవిత్ర లోకేష్ ని ఆయన వివాహం చేసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. పవిత్రతో పాటు నరేష్ ఒక గుడిలో పూజలు చేస్తూ కనిపించారు. దీంతో పెళ్లి పుకార్లు పుట్టుకొచ్చాయి. నేను ఆమెను వివాహం చేసుకోలేదు, సహజీవనం చేస్తున్నానంతే అని నరేష్ ధైర్యంగా చెప్పాడు. పెళ్లిపై నాకు నమ్మకం లేదు. అభిమానించే, విశ్వాసం కలిగిన ఒక వ్యక్తి తోడు అవసరం.. అందుకే పవిత్ర నేను కలిసి జీవిస్తున్నామని స్పష్టత ఇచ్చాడు.

Latest Videos


ఇక పెళ్లంటారా... ప్రస్తుతానికి చెప్పలేను, భవిష్యత్ లో జరగొచ్చు జరగకపోవచ్చని క్లియర్ గా చెప్పేశాడు. ఇది జరిగిన కొన్ని నెలలు మాత్రమే గడిచింది. రెండేళ్లకు పైగా పవిత్ర-నరేష్ కలిసి జీవిస్తున్నట్లు సమాచారం. లేటెస్ట్ ట్విస్ట్ ఏమిటంటే, పవిత్రతో కూడా నరేష్ విడిపోయారట. ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారట.

Naresh- Pavitra Lokesh


దానికి కారణం నరేష్ మరో నటికి దగ్గర కావడమే అని తెలుస్తుంది. పవిత్ర లోకేష్ కి నరేష్ గుడ్ బై చెప్పేశాడట. కొత్తగా మరొక నటితో సన్నిహితంగా ఉంటున్నారట. పవిత్ర లోకేష్ తో నరేష్ బంధం ముగిసినట్లే అని టాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి. మరి నరేశ్ కి దగ్గరైన నటి వివరాలు బయటకు రాలేదు. 


మరోవైపు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఆయనపై న్యాయపోరాటం చేస్తున్నారు. పవిత్ర లోకేష్ తో బంధాన్ని కూడా ఆమె వ్యతిరేకించారు. వారిద్దరినీ దూషిస్తూ హైడ్రామా నడిపారు. నరేష్ నాకు ఇంకా విడాకులు ఇవ్వలేదని రమ్య రఘుపతి ఆరోపిస్తున్నారు. కొత్తగా తెరపైకి వచ్చిన ఆరోపణలు సంచలనంగా మారాయి. 
 

click me!