చియాన్ విక్రమ్ కు భయంకరమైన యాక్సిడెంట్.. మూడేండ్లు వీల్ చైర్ లోనే.. 23 సర్జరీలు..

First Published | Apr 23, 2023, 2:15 PM IST

తమిళ స్టార్ చియాన్ విక్రమ్ ప్రస్తుతం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ (PS2) ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.  ఈ సందర్భంగా విక్రమ్ కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆ వార్త అభిమానులను షాక్ కు గురి చేస్తోంది. 
 

తమిళ స్టార్ చియాన్ విక్రమ్ (Chiyaan Vikram)కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ హీరోకు అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సినిమాల పరంగా ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. డిఫరెంట్ లుక్స్ లో కనిపించేందుకు, విభిన్న కథలతో  అలరించేందుకు శ్రమిస్తూనే ఉంటారు. 
 

సినిమాల కోసం నటుడిగా రిస్క్ తీసుకునే కొద్దిమంది హీరోల్లో చియాన్ విక్రమ్ పేరు మొదట వినిపిస్తోంది. ‘శివపుత్రుడు’, ‘అపరిచితుడు’, ‘ఐ’, ‘ఇంకొక్కడు’, ‘మహాన్’, వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్ని సైతం కొల్లగొట్టారు.  గతేడాది మహాన్, కోబ్రా, పొన్నియిన్ సెల్వన్ - 1, చిత్రాలతో అలరించారు. ప్రస్తుతం PS2 ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. 


ఈక్రమంలో చియాన్ విక్రమ్ కు సంబంధించిన ఓ న్యూస్ బయటికి వచ్చింది. చిన్నవయస్సులోనే అతి ఘోరమైన యాక్సిడెంట్ కు గురైనట్టు తెలుస్తోంది. ఆ ప్రముఖ ఛానెల్స్ కథనం ప్రకారం.. 12 ఏళ్ల వయస్సులో చియాన్ విక్రమ్ భయంకరమైన ప్రమాదానికి గురయ్యాడు. తన స్నేహితుడితో కలిసి బైక్ పై వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది.
 

ఈ ప్రమాదంలో విక్రమ్ కు భారీ గాయాలు తగిలాయి. కొద్దికాలం బెడ్ కే పరిమితమయ్యాడు. అయినా గాయాలు మానడం లేదు. అతని కుడికాలికి తగిన దెబ్బ ఎంతకూ తగ్గకపోవడంతో కాలు కూడా తీసివేయాలని వైద్యులు విక్రమ్ అమ్మగారికి సూచించారంట.  కానీ విక్రమ్ నిరాకరించాడంట. కాలికే కాకుండా శరీరంలో అన్ని చోట్ల గాయాలయ్యారు. ఎముకలూ విరిగాయి.  
 

ఏకంగా డాక్టర్లు విక్రమ్ కు 23 సర్జరీలు చేసి గాయాలను మాన్పించారు. దాంతో మూడేండ్ల పాటు నడవలేని స్థితిలో వీల్ చైర్ కే పరిమితం అయ్యాడు విక్రమ్. అయినా ఆత్మవిశ్వాసం  కోల్పోలేదు. నటుడు కావాలన్న బలమైన కోరికే విక్రమ్ ను కోలుకునేలా చేసిందని విక్రమ్ ఓ సందర్భంలోనూ చెప్పారు.  

ప్రస్తుతం టాప్ హీరోగా దూసుకెళ్తున్నారు. పా  రంజిత్ దర్శకత్వంలో ‘తంగలన్’లో నటిస్తున్నారు. అలాగే ‘ధ్రువ నక్షత్రం’లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. వీటితో పాటు ప్రస్తుతం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ప్రచార కార్యక్రమాలకు రోజుకో లుక్ లో హాజరవుతూ ఆకట్టుకుంటున్నారు. తన స్టైల్ తో యూత్ ను అట్రాక్ట్ చేస్తున్నారు. 

Latest Videos

click me!