చిరు, ప్రభాస్‌, బాలయ్య, ఎన్టీఆర్‌, మహేష్‌, బన్నీ, వెంకీ.. హీరోల సినిమా షూటింగ్‌లు వాయిదా ? అయోమయంలో టాలీవుడ్‌

First Published | Apr 21, 2021, 2:24 PM IST

కరోనా నేపథ్యంలో చిత్ర పరిశ్రమ మాత్రం స్వచ్ఛంగా బండ్‌ పాటిస్తుంది. చిరంజీవి, ప్రభాస్‌, బాలయ్య, ఎన్టీఆర్‌, బన్నీ, మహేష్‌, వెంకీ, రవితేజ, గోపీచంద్‌.. ఇలా హీరోలంతా షూటింగ్‌లు వాయిదా వేసుకుంటున్నారు. 
 

కోవిడ్‌ 19 దేశంలో విలయతాండవం చేస్తుంది. దీంతో మరోసారి లాక్‌డౌన్‌ పరిస్థితులు కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ వేయకపోయినా, ఎవరికి వారు స్వచ్ఛంగా ఆయా నిబంధనలు పాటించాలని తాజాగా మోడీ జాతినుద్దేశించి చెప్పారు. అంటే ఎవరికి వారు లాక్‌డౌన్‌లా ఫీలై జాగ్రత్తగా ఉండాలని, లాక్‌డౌన్‌ పరిస్థితులు తీసుకురావద్దని చెప్పారు. దీంతో ఇది మరోసారి చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపబోతుంది. మరోసారి సినిమా పరిశ్రమ స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే థియేటర్లని స్వచ్ఛందంగా బంద్‌ చేస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌ వెల్లడించింది. సినిమా షూటింగ్‌లు కూడా అత్యవసరమైతేనే యాభై శాతం యూనిట్‌తో చిత్రీకరణ జరుపుకోవాలని, పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ లోనూ ఇలాంటి నిబంధనలే పాటించాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌ ప్రకటించింది.
ఇక ఇప్పుడు స్టార్‌ హీరోల షూటింగ్‌లు కూడా స్వచ్ఛందంగా ఆగిపోతున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, ప్రభాస్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, బన్నీ, గోపీచంద్‌, రవితేజ, నాగచైతన్య ఇలా దాదాపు పెద్ద హీరోలంతా తమ షూటింగ్‌లను కొన్ని రోజులు వాయిదా వేసుకుంటున్నారు.

ఇప్పటికే చిరంజీవి నటిస్తున్న `ఆచార్య` షూటింగ్‌కి అనాధికారికంగా గ్యాప్‌ ఇచ్చారు. గత రెండు రోజులుగా షూటింగ్‌ని నిలిపివేసినట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం కావాల్సిన `లూసిఫర్‌` రీమేక్‌ షూటింగ్‌ని కూడా కొన్ని రోజులు వాయిదా వేసుకున్నారు.
దీంతోపాటు బాలయ్య ప్రస్తుతం `అఖండ` సినిమాలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ని కూడా వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బాలయ్య నుంచి యూనిట్‌కి వాయిదా సిగ్నల్‌ వెళ్లిందని టాక్‌.
అలాగే దర్శకుడు అనిల్‌ రావిపూడికి ఇటీవల కరోనా సోకింది. దీంతో వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న `ఎఫ్‌3` సినిమా షూటింగ్‌ని వాయిదా వేశారు. ఈ వాయిదాని మరికొన్ని రోజులు పెంచే అవకాశం ఉందట. ఇది గతంలో వచ్చిన `ఎఫ్‌2`కి సీక్వెల్‌ అన్న విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం `హరిహర వీరమల్లు`, `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయనకు ఇటీవల కరోనా సోకడంతో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. దీంతో ఆటోమెటిక్‌గా ఆయన నటిస్తున్న సినిమాల షూటింగ్‌లు వాయిదా పడ్డాయి.
ప్రభాస్‌ ప్రస్తుతం `రాధేశ్యామ్‌`, `సలార్‌`, `ఆదిపురుష్‌` సినిమాల్లో నటిస్తున్నారు. `రాధేశ్యామ్‌` షూటింగ్‌ పూర్తయ్యింది. కానీ సినిమా రషెస్‌ చూసుకున్నాక కొంత రీషూట్‌ చేద్దామని ప్రభాస్‌ సూచించారు. దీంతో అది చిత్రీకరించబోతున్నారు. కానీ ఇది కూడా ఆలోచిస్తున్నారట.
దీంతోపాటు మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సిన `సలార్‌` షూటింగ్‌ని, అలాగే `ఆదిపురుష్‌` చిత్రీకరణలు కూడా కొన్ని రోజులు వాయిదా వేయాలని ప్రభాస్‌ అనుకుంటున్నారట. దర్శక, నిర్మాతలు కూడా అదే విషయంపై నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారని టాక్‌.
మహేష్‌ ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ నిమిత్తం ఫారెన్‌ టూర్‌ వెళ్లాల్సింది. కానీ దాన్ని రద్దు చేస్తుంది. హైదరాబాద్‌లోనే ఓ షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశారు. కానీ ఇప్పుడు అది కూడా ఆగిపోయిందని, కరోనా కారణంగానే వాయిదా వేసుకుంటున్నారని టాక్‌ వినిపిస్తుంది.ఇందులో కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇదే బాటలో రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న `ఆర్‌ఆర్‌ఆర్‌` కూడా ఉంది. ఈ సినిమాని అనాధికారికంగా చాలా రోజులుగానే షూటింగ్‌ని ఆపేవారు. ఈ సినిమా కూడా దాదాపు పూర్తి కావచ్చింది. క్లైమాక్స్ లో కొంత భాగం, ఓ సాంగ్‌, ప్యాచ్‌ వర్క్ పెండింగ్‌ ఉందని తెలుస్తుంది. అయితే అలియాభట్‌ కి కరోనా సోకడంతో షూటింగ్‌ని పక్కన పెట్టేసి పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు కంప్లీట్‌ చేసే పనిలో ఉన్నారు.
అల్లు అర్జున్‌ నటిస్తున్న `పుష్ప` చిత్రం షూటింగ్‌ కూడా వాయిదా పడ్డట్టు టాక్‌. సుకుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కరోనా తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌ని కూడా కొన్ని రోజులు వాయిదా వేసుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
రవితేజ నటిస్తున్న కొత్త సినిమాని ఇటీవలే వాయిదా వేశారు. శరత్‌ మండవ దర్శకత్వంలో రూపొందే సినిమా ఇటీవల ఓపెనింగ్‌ జరుపుకుంది. మూడు రోజుల క్రితమే సినిమా ప్రారంభం కావాల్సి ఉండగా, దాన్ని వాయిదా వేశారు.
విజయ్‌ దేవరకొండ నటిస్తున్న `లైగర్‌` సినిమా వాయిదా పడింది. ముంబయిలో ప్రధాన భాగం షూటింగ్‌ జరుపుకుంటోంది. అక్కడ లాక్‌డౌన్‌ విధించడంతో సినిమా షూటింగ్‌ని ఆపేశారని టాక్‌. అలాగే గోపీచంద్‌ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న `పక్కా కమర్షియల్‌` సినిమా కూడా వాయిదా పడ్డట్టు తెలుస్తుంది. ఇదే కాదు నాగచైతన్య, విక్రమ్‌ కుమార్‌ కాంబినేషన్‌లో రూపొందే `థ్యాంక్యూ`, వరుణ్‌ తేజ్‌ `గని` ఇలా చాలా సినిమాలు వాయిదా వేసుకుంటున్నట్టు తెలుస్తుంది. దాదాపు మే మొత్తం షూటింగ్‌లకు దూరంగా ఉండాలని, అనాధికారికంగా లాక్‌డౌన్‌ పాటించాలని భావిస్తున్నారట.
గతేడాది లాక్‌డౌన్‌, కరోనాతోనే చిత్ర పరిశ్రమ చాలా నష్టపోయింది. ముఖ్యంగా నిర్మాతలకు భారీగా నష్టం వాటిల్లింది. సినిమాల షూటింగ్‌లు మధ్యలోనే ఆగిపోవడం, తెచ్చిన ఫైనాన్స్ మనీకి వడ్డీలు పెరగడంతో నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మళ్లీ బంద్‌ అంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డ పరిస్థితి. ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమ కోలుకుంటున్నందన్న పరిస్థితుల్లో మళ్లీ కరోనా విజృంభన కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు.
ఇప్పటికే థియేటర్లని బంద్‌ పాటిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు బంద్‌ పాటించాలని నిర్ణయించారు. అలా ఎగ్జిబిటర్లకు కూడా కష్టాలు తప్పవు. ఇప్పుడు షూటింగ్‌లు కూడా ఆగిపోతే మరోసారి సినీ కార్మికులకు సినీ కష్టాలు తప్పవని చెప్పొచ్చు. మళ్లీ ఆకలి కష్టాలు మొదలవుతాయని చెప్పొచ్చు. మరి దీన్ని సినీ పెద్దలు ఎలా ఎదుర్కొంటారు, కార్మికులను ఆదుకుంటారా? అన్నది చూడాలి.

Latest Videos

click me!