చిరు `ఆపద్భాంధవుడు` హీరోయిన్‌ మీనాక్షి శేషాద్రి ఇలా అయిపోయిందేంటి? షాకిస్తున్న కొత్త లుక్‌

First Published | Jun 7, 2021, 3:39 PM IST

చిరంజీవి నటించిన గొప్ప చిత్రాల్లో `ఆపద్భాంధవుడు` ఒకటి. ఇందులో చిరు సరసన నటించిన మీనాక్షి శేషాద్రి తన అభినయంతో మెస్మరైజ్‌ చేసింది. ముప్పైఏళ్ల తర్వాత ఈ అమ్మడిని చూస్తే షాక్‌ అవుతారు. గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. 

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన `ఆపద్భాంధవుడు` చిత్రం 1992లో విడుదలై మంచి విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను దక్కించుకుంది. విమర్శకుల ప్రశంసలందుకుంది.
ఈ సినిమాతో పాపులర్‌ అయ్యింది మీనాక్షి శేషాద్రి. ఈ చిత్రం కంటే ముందే తెలుగులో `బ్రహ్మర్షి విశ్వామిత్ర`లో నటించింది. కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. `ఆపద్భాందవుడు` చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే ఆ తర్వాత తెలుగులో మరే సినిమా చేయలేదు. అవకాశాలు రాలేదా? లేక తాను నో చెప్పిందో తెలియదు గానీ ఈ రెండు చిత్రాల్లోనే నటించింది.
కానీ బాలీవుడ్‌లో మాత్రం స్టార్‌ హీరోయిన్‌గా రాణించి అక్కడ బాగా ఆకట్టుకుంది. యాబైకి పైగా చిత్రాల్లో నటించి హిందీ ఆడియెన్స్ ని మెస్మరైజ్‌ చేసింది. టాప్‌ హీరోలందరితోనూ ఆడిపాడింది.
18 ఏళ్ల వయసులో మిస్‌ ఇండియా టైటిల్‌ సొంతం చేసుకొని పలు సినిమా అవకాశాలు దక్కించుకుంది. మోడల్‌గా కెరీర్‌ తర్వాత నటిగా మారి హిందీ చిత్ర సీమని ఓ ఊపుఊపింది.
బాలీవుడ్‌లో మరోసారి చిరంజీవి సరసన `గ్యాంగ్‌లీడర్‌` రీమేక్‌ చిత్రం `ఆజ్ కా గూండారాజ్` సినిమాలోనూ నటించింది.
1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిపోయింది. 1997 తర్వాత ఆమె పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికీ డాన్సర్‌గా రాణిస్తున్నారు.
సాంప్రదాయ నృత్యాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ విషయంలో ఆమెకి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఆమెకి ఇద్దరు పిల్లలు. పూర్తిగా ఫ్యామిలీతో సంతోషంగా జీవితాన్ని గడిపేస్తుంది.
ఇదిలా ఉంటే ఇటీవల ఆమెకి సంబంధించి ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏమాత్రం గుర్తు పట్టేలేని విధంగా ఉండి షాక్‌ ఇస్తుంది.
ప్రస్తుతం 57 ఏళ్ల మీనాక్షి ముఖంలో కళ తప్పిపోయి వయసు మళ్లిన ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
లేటెస్ట్ లుక్‌లో షాక్‌ ఇస్తున్న మీనాక్షి శేషాద్రి.
ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు అసలు ఈమె మీనాక్షి యేనా అని ఆశ్చర్యపోతున్నారు. అప్పట్లో ఎంతో అందంగా ఉన్న మీనాక్షి ఇలా అయ్యిందేంటి అని షాకవుతున్నారు.
ఆమె ఇటీవల వరుసగా తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటూ సోషల్‌ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
మీనాక్షి పాత చిత్రాలు.
భర్త, పిల్లలతో మీనాక్షి.
మీనాక్షి శేషాద్రి ఓల్డ్ లుక్‌.
`ఆపద్భాంధవుడు`లో చిరు,మీనాక్షి.

Latest Videos

click me!