టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తిరుగులేని శిఖరం. దశాబ్దాలుగా చిరంజీవి చిత్ర పరిశ్రమలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. చిరంజీవి టాలీవుడ్ లో తిరుగులేని శక్తి మాత్రమే కాదు సహనానికి మరో పేరు. కష్టమంటూ వచ్చిన వారిని ఆదుకునే మనస్తత్వం. పలు కారణాల వల్ల చిరంజీవి చాలా మంది నుంచి నిందలు ఆరోపణలు ఎదుర్కోనున్నారు.
వాటన్నింటిని చిరు చిరునవ్వుతోనే ఎదుర్కొన్నారు. చిరంజీవిని తిట్టినవారే సాయం అంటూ ఆయన వద్దకే వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ప్రముఖ రచయిత చిన్న కృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గతంలో చిన్ని కృష్ణ చిరంజీవిని నోటికొచ్చినట్లు దుర్బాషలు ఆడిన సంగతి తెలిసిందే.
చిరంజీవికి ఇంద్ర చిత్రానికి కథ అందించింది చిన్ని కృష్ణే. అంత పెద్ద హిట్ చిత్రానికి కథ ఇచ్చినప్పటికీ చిరంజీవి ఏ రోజు తనని ఇంటికి పిలిచి భోజనం పెట్టలేదు అని చిన్ని కృష్ణ అనేక ఆరోపణలు చేశారు. తాజాగా చిన్ని కృష్ణ తన తప్పు తెలుసుకున్నారు. అన్నయ్య చిరంజీవిని తిట్టినందుకు ఎంతో భాదపడుతున్నాని పేర్కొన్నారు.
చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన తర్వాత చిన్ని కృష్ణ ఆయన్ని కలిశారు. ఏ విషయాలు మనసులో పెట్టుకోకుండా అన్నయ్య తనని రిసీవ్ చేసుకున్న విధానం మనసుని హత్తుకున్నట్లు చిన్ని కృష్ణ తెలిపారు. అందరూ తప్పులు చేస్తారు.. తప్పుగా మాట్లాడతారు. నాకు బ్యాడ్ టైం నడుస్తున్న సమయంలో అన్నయ్యని నేను తిట్టాల్సి వచ్చింది.
అవి నా మనసులో నుంచి వచ్చిన మాటలు కాదు. కొందరు వ్యక్తులు నాపై ఒత్తిడి పెంచి చిరు అన్నయని ఆ విధంగా తిట్టించారు. తప్పు చేశాను. చిరంజీవి అన్నయ్యని క్షమించమని కోరాను. ఆయన పెద్ద మనసుతో క్షమించారు. ఆప్యాయంగా ఏమైనా కథ రాస్తున్నావా అని అడిగారు. మంచి కథ ఉంటే తీసుకురా కలసి పనిచేద్దాం అని అన్నారు.
ఆ మాటలు నా హృదయాన్ని కదిలించాయి. అన్నయ్యని నోటికొచ్చినట్లు తిట్టినందుకు నా భార్య, బిడ్డలు, చెల్లి, బావ అదే విధంగా సమాజం అంతా నన్ను భయంకరంగా తిట్టారు. తప్పు చేస్తున్నావ్ అని హెచ్చరించారు. అప్పటి నుంచి మనసులో భగవంతుడిని చేసిన తప్పుకు క్షమాపణ కోరుతూనే ఉన్నా.
నాలో నేనే కుమిలిపోయా. ఆ తర్వాత చిరు అన్నయ్యకి నేను ఎదుట పడలేదు. పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసి వెళ్లి కలిశా. ఆయన రిసీవ్ చేసుకున్న విధానం చూసి ఎంత తప్పు చేశానో అనిపించింది. ఒక వేళ భవిష్యత్తులో చిరంజీవి గారితో కలసి పనిచేసే అవకాశం వస్తే ఆ కథ దేశం గర్వించే విధంగా ఉంటుంది అని చిన్ని కృష్ణ అన్నారు.