ఇక రామ్ ఆశలన్నీ బోయపాటి సినిమాపైనే. బోయపాటి, రామ్ కాంబినేషన్ లో ఇటీవల చిత్రం ప్రారంభం అయింది. ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. బోయపాటి సినిమాలన్నీ దాదాపుగా ఒకే ఫార్మాట్ లో ఉంటాయి. మాస్ ప్రేక్షకులే టార్గెట్ గా బోయపాటి అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్ క్రియేట్ చేశారు. అవే సినిమా విజయానికి కీలకంగా ఉంటాయి.