మాల్దీవుల్లో సెక్సీ బ్యూటీ సోనాక్షి కేకపెట్టించే పోజులు.. చూస్తే ఇక అంతే..!

First Published | Nov 23, 2020, 7:28 PM IST

టాలీవుడ్‌, బాలీవుడ్‌.. ఇండస్ట్రీ ఏదైనా ఇప్పుడు చాలా మంది తారలు మాల్దీవుల్లో సేదతీరుతున్నారు. ఇంకా చెప్పాలంటే చాలా వరకు ఇండియాకి చెందిన సెలబ్రిటీలు ఇప్పుడు మాల్దీవుల్లో మకాం పెట్టారు. తాజాగా సోనాక్షి సిన్హా సైతం మాల్దీవుల్లో బికినీలో కనిపించి కనువిందు చేస్తుంది. 
 

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శతృఘ్న సిన్హా తనయగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సోనాక్షి సిన్హా.. తనకంటూ ఓ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.
గ్లామర్‌ పాత్రలను, ఛాన్స్ దొరికినప్పుడు బలమైన పాత్రలు పోషిస్తూ నటిగా తన లోని మరో కోణాన్ని ఆవిష్కరించేందుకు తపిస్తుంది.

ఇటీవల కాలంలో సినిమా ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న ఈ సెక్సీ బ్యూటీ ఇప్పుడు మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తుంది. చాలా మంది కథానాయికలు మాల్దీవుల్లో సేద తీరుతున్నారు. రకుల్‌ కూడా అక్కడే ఉన్నారు.
ఈ నేపథ్యంలో తాను కూడా లాక్‌డౌన్‌ నుంచి బయటపడి రిలాక్స్ అవుతోంది. ప్రస్తుతం అక్కడి దిగిన ఫోటోలను పంచుకుంది సోనాక్షి.
అందులో బీచ్‌లో వాటర్‌లోకి వెళ్ళి సాయంతం వేళ సేద తీరుతుంది. ఆ ప్రకృతి, ఆ మూవ్‌మెంట్‌ని ఆస్వాధిస్తుంది. ముసి ముసినవ్వులు నవ్వుతోంది. వాటర్‌లోనే ఆనందం ఉందని పేర్కొంది.
మరో ఫోటోలో ఇసుకలో కూర్చోని విరహ వేదన తరహాలో పోజిచ్చింది. పక్కన పచ్చని చెట్టు, వెనకాల గెస్ట్ హౌజ్‌ లొకేషన్‌ అదిరిపోయింది. అయితే ఇందులో సోనాక్షి బ్లాక్‌ బికినీతోపాటు వైట్‌ బనియన్‌ తరహా డ్రెస్‌ ధరించింది. ఇందులో ఐస్‌లాండ్‌ గర్ల్ అని పేర్కొంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ మాల్దీవ్స్ బ్యూటీ అందాలను చూసేందుకు ఎగబడుతున్నారు.
బొద్దుగా ఉంటూ మత్తెక్కించే చూపులతో, హీటు పెంచే అందాలతో కనువిందు చేసే సోనాక్షి ఓ వైపు కమర్షియల్‌ సినిమా, మరోవైపు బలమైన పాత్ర కలిగిన సినిమాలు చేస్తూ రాణిస్తుంది.
గతేడాది `కళంక్‌`, `ఖాందాని షఫఖానా`, `మిషన్‌ మంగళ్‌`, `దబాంగ్‌3` చిత్రల్లో నటించింది. ఇందులో `మిషన్‌ మంగళ్‌` విజయం సాధించగా, మిగిలిన సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం సోనాక్షి `భుజ్‌ః ది ప్రైజ్‌ ఆఫ్‌ ఇండియా` చిత్రంలో నటిస్తుంది. ఇందులో అజయ్‌ దేవగన్‌ సరసన రొమాన్స్ చేస్తుంది.

Latest Videos

click me!