‘నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది’.. బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా షాకింగ్ కామెంట్స్!

First Published | Feb 25, 2023, 6:14 PM IST

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా (Parineeti Chopra) తాజాగా తన రిలేషన్ షిప్ పై స్పందించింది. ఈ సందర్భంగా తానూ పెళ్లికి సిద్ధంగానే ఉనాన్నంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 
 

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా (Parineeti Chopra) బ్యాక్ టు బ్యాక్ హిందీ చిత్రాల్లో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కజిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస చిత్రాలతో అలరిస్తోంది. గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చినా పెద్దగా హిట్స్ ను అందుకోలేకపోయింది.
 

అయినా.. అవకాశాలను అందుకుంటూ తన ఫ్యాన్స్ ను అలరిస్తోంది. ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లోనూ నటిస్తోంది. ఈ  సందర్భంగా ఓ బాలీవుడ్ మీడియాతో యంగ్ బ్యూటీ స్పెషల్ ఇంటర్వ్యూను ఇచ్చింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. 
 


ప్రస్తుతం బాలీవుడ్ తారలు ఒక్కటవుతున్న క్రమంలో ఇంటర్వ్యూయర్ తన రిలేషన్ షిప్ పై పరిణీతి చోప్రాను అడిగిన ప్రశ్నకు షాకింగ్ గా బదులిచ్చింది. ఈ సందర్భంగా పరిణీతి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం తను ఎవరితోనూ రిలేషన్ షిప్ లో లేనని బదులిచ్చింది.
 

తనకూ పెళ్లి చేసుకోవాలనే ఉందన్నారు.  కానీ వరుడు లేడని చెప్పింది. బాలీవుడ్ లో జరుగుతున్న పెళ్లిళ్లు చూస్తుంటే తనకు మింగిల్ అవ్వాలనే ఆసక్తి పెరుగుతోందని చెప్పుకొచ్చింది. కానీ ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్నానని  చెప్పింది. 

రీసెంట్ గా పెళ్లి పీటలు ఎక్కిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అలియా భట్, కియారా అద్వానీ, అతియా శెట్టిలు తన స్నేహితులేనని కూడా వివరించింది. అయితే.. ఇన్నాళ్లు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుందాంట. కానీ ఇప్పుడు అభిప్రాయం మార్చుకుందని తెలిపింది.

ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నా వరుడు లేడని తెలిపింది. ఈసందర్భంగా సరదాగా ‘నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అబ్బాయి ఉంటే చూడంటూ ఓపెన్ గా కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ ‘క్యాప్సూల్ గిల్’ ‘చమ్కిలా’ చిత్రాల్లో నటిస్తోంది. 

Latest Videos

click me!