బాబోయ్.. ఆటంబాంబ్ పోజులతో కుర్ర గుండెల్నిపేల్చేస్తున్న కత్రినా.. థైస్ షోతో హీటుపెంచుతున్నస్టార్ బ్యూటీ!

First Published | Mar 4, 2023, 12:38 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. కత్రినా తాజాగా పంచుకున్న ఫొటోలకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
 

అందాల హాట్ భామ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘మల్లీశ్వరి’,‘అల్లరి పిడుగు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో పరిచయం అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తోంది. 
 

ప్రస్తుతం కత్రినా నటిస్తున్న రెండు చిత్రాలు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. షూటింగ్స్ తో బిజీగా ఉంటున్న ఈ హాట్ బ్యూటీ.. ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూనే ఉంది. ఈ సందర్భంగా అదిరిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ మెరుపులో మెరిపిస్తోంది. 


ఇటీవల బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ వస్తున్న కత్రినా తాజాగా స్టన్నింగ్ పోజులతో అదరగొట్టింది. మినీ డ్రెస్ లో మంటలు రేపుతోంది. డెనీమ్ మినీ  షార్ట్, డెనీమ్ షర్ట్ ధరించి లోదుస్తులు కనిపించేలా అందాల విందుతో అదరగొట్టింది. ఆ పిక్స్ ను ప్యాన్స్ తో పంచుకుంది. 
 

అప్పటి గ్లామర్ కేరాఫ్ అడ్రస్ గా మారిన కత్రినా ఇలా స్టన్నింగ్ ఫొటోషూట్లతోనూ అదరగొట్టంతో నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొన్నటి వరకు చీరకట్టులో మెరిసిన ఈ భామ.. లేటెస్ట్ గా పొట్టి డ్రెస్ లో థైస్ షోతో అదరగొట్టడం కుర్రగుండెల్ని  పేల్చేశాలా ఉన్నాయి.  
 

రెండేండ్ల కింద 2021 లాక్ డౌన్ లో నే కత్రినా బాలీవుడ్ నటుడు విక్కీ  కౌషల్ ను పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. పార్టీలు, వేకేషన్స్, టూర్లు, ఆయా ఈవెంట్లకు కలిసి హాజరవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారీ స్టార్ కపుల్. మరోవైపు కేరీర్ లోనూ ఎవరికీ వారు బిజీగానే ఉంటున్నారు. 
 

చివరిగా ‘సూర్యవంశీ’, ‘ఫోన్ భూత్’ చిత్రాలతో అలరించింది కత్రినా. ప్రస్తుతం మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ‘మేరీ క్రిస్టమస్, టైగర్ 3’లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ‘టైగర్3’ ఈ ఏడాది  నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

Latest Videos

click me!