రాముడు నచ్చడు.. కృష్ణుడులాంటి మొగుడు కావాలి..బిగ్‌బాస్‌ బ్యూటీ మోనాల్‌ సంచలన వ్యాఖ్యలు..

First Published | Jan 26, 2021, 8:28 AM IST

హాట్‌ అందాలతో ఆకట్టుకునే బిగ్‌బాస్‌4 ఫేమ్‌ మోనాల్‌ గజ్జర్‌ తాజాగా వివాదాల్లో ఇరుక్కుంది. మొన్నటి వరకు అఖిల్‌తో ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయిన ఈ భామ ఉన్నట్టు రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో అభిమానుల ఆగ్రహానికి గురవుతుంది. సోషల్‌ మీడియాలో ట్రోల్‌కి గురవుతుంది మోనాల్‌. మరి ఇంతకి మోనాల్‌ ఏం చేసింది?

మోనాల్‌ గజ్జర్‌ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఓ ఐదారు సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో ఆమెకి బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ బాగా కలిసొచ్చింది.
ఈ షోలో ప్రతి రోజూ హైలైట్‌ అయ్యింది ఎవరైనా ఉన్నారంటే అది మోనాల్‌ మాత్రమే అని చెప్పాలి. ఓ వైపు హాట్‌ అందాలు, మరోవైపు వచ్చీరాని తెలుగు, దీంతోపాటు అఖిల్‌తో పులిహోర కలపడం, దీనికితోడు ప్రతి చిన్న దానికి కన్నీళ్లు పెట్టుకోవడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ క్రమంలో అఖిల్‌తో చివరి వరకు రొమాంటిక్‌ రిలేషన్‌ మెయింటేన్‌ చేసింది. హౌజ్‌పై ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేసింది. వీరిద్దరి లవ్‌ ట్రాక్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. అది పెళ్లి వరకు వెళ్లింది.
హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక ఇటీవల `అల్లుడు అదుర్స్ ` చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌ చేసి తన అందచందాలతో షేక్‌ చేసింది. దీనికోసం ఏకంగా 15 లక్షల పారితోషికం తీసుకుందట. మరోవైపు యాభై లక్షలు తీసుకుందనే ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు స్టార్‌ మాలోనే `డాన్స్ ప్లస్‌` డాన్స్ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది. అక్కడ కూడా మాస్టర్‌ సాకెత్‌తో పులిహోర కలుపుతుందీ సెక్సీ భామ.
ఈ క్రమంలో తాజాగా మోనాల్‌ రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మాటకి ముందు, మాట తర్వాత జైసే కృష్ణ అంటూ పలికే ఈ బ్యూటీకి రాముడు నచ్చడట. ఆయనంటే ఇష్టం లేదని చెప్పింది. కృష్ణుడే కావాలని బలంగా కోరుకుంది.
ఓ ఇంటర్వ్యూలో మీకు ఎలాంటి మొగుడు కావాలని ప్రశ్నించగా, అందుకు మోనాల్‌ గజ్జర్‌ మాట్లాడుతూ, తనకు కృష్ణుడు లాంటి భర్త కావాలని చెప్పింది. జనరల్‌గా ఎవరైనా రాముడిలాంటి భర్త కావాలని కోరుకుంటారు. మీరేంటి అలా అని అడగ్గా.. `రాముడు అస్సలు నచ్చడు. ఆయన ఎవరో చెప్పిన మాట విని భార్య(సీత)ని అవమానించాడు. ఒకవేళ ఆయన ఇప్పుడు తనకు కనిపిస్తే ఎందుకలా చేశావని ప్రశ్నిస్తా` అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
దీంతో ఇప్పుడు మోనాల్‌ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. రాముడి గురించి నీకు ఏం తెలుసు, ఎలాంటి అవగాహన లేకుండా రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా?, వెంటనే సారీ చెప్పాలి, లేదంటే సీన్‌ మరోలా ఉంటుందని రాముడి అభిమానులు, సోషల్‌ మీడియాలోని నెటిజన్లు కామెంట్‌ చేస్తూ ఫైర్‌ అవుతున్నారు. మోనాల్‌ని ట్రోల్‌ చేస్తున్నారు.
రాముడు అలా చేసాడు కాబట్టే సీత గురించి ప్రపంచం మాట్లాడుకుంటుందంటూ రాముడి అభిమానులు అంటున్నారు. మొత్తానికి జైసే కృష్ణ అంటూ రాముడిపై కామెంట్‌ చేసి వివాదాల్లో ఇరుక్కుంది మోనాల్‌. మరి దీనిపై సారీ చెబుతుందా? లేదా? మున్ముందు ఏం జరగబోతుందో చూడాలి.

Latest Videos

click me!