అఖిల్‌కి హ్యాండిచ్చిన మోనాల్‌.. విచిత్రమైన నామినేషన్‌లో ఆ నలుగురు

First Published | Nov 23, 2020, 10:25 PM IST

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ పన్నెండో వారంలోకి అడుగు పెట్టింది. ఈ వారం నామినేషన్‌ ఊహించని విధంగా జరిగింది. అవినాష్‌,  మోనాల్‌ మధ్య చర్చ, అఖిల్‌, మోనాల్‌ మధ్య వాగ్వాదం సరికొత్త వివాదాలను క్రియేట్‌ చేసింది. అంతేకాదు ఇంట్లో కొత్తబంధాలు చిగురిస్తున్నాయి. 

ఆదివారం లాస్య ఎలిమినేట్‌ కావడంతో ఇంట్లో ఏడుగురు సభ్యులున్నాయి. సోమవారం ఎపిసోడ్‌ మంచి పాటతో సభ్యుల్లో జోష్‌ నింపింది. అనంతరం బిగ్‌బాంబ్‌ మేరకు అభిజిత్‌కిచెన్‌లో వర్క్ చేయాల్సి వచ్చింది. దోశలు వేసే విషయంలో అభిజిత్‌, సోహైల్‌ మధ్య ఫన్నీ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అభిజిత్‌ సరిగా దోశ వేయడం లేదని సోహైల్‌కామెంట్‌ చేశాడు.
అనంతరం తమ లవ్‌ ఎఫైర్‌ గురించి అఖిల్‌, మోనాల్‌ చర్చించుకున్నారు. ఆదివారం నాగార్జున ముందు అభిజిత్‌, అఖిల్‌, మోనాల్‌ మధ్య జరిగిన విషయాలనుచర్చించుకున్నారు. ఈ సందర్భంగా అఖిల్‌.. మోనాల్‌కి ఓ క్లారిటీ ఇచ్చాడు. తనతో ఎక్కువ హుక్‌ అయిపోతున్నానని, అది నచ్చడం లేదని తెలిపారు. ఇదే అఖిల్‌కొంపముంచింది. రెండున్నర నెలలుగా సాగిన వీరి రిలేషన్‌పై ప్రభావం పడినట్టయ్యింది.

అనంతరం పొట్ట విషయంలో అవినాష్‌ని అఖిల్‌, సోహైల్‌, అరియానా ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. పొట్ట తగ్గిందని, బ్యాక్‌ పోయిందని, పెళ్లై పిల్లలు కూడా ఉన్నారని అవినాష్‌నిసోహైల్‌, అఖిల్‌, అరియానా ఆటపట్టించారు. ఓ రేంజ్‌లో ఏడిపించారని చెప్పొచ్చు.
ఆ తర్వాత పన్నెండో వారం నామినేషన్‌ ప్రారంభమైంది. సభ్యులంతా గార్డెన్‌లో ఉన్న టోపీలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ టోపీలో ఉన్న గ్రీన్‌ కలర్‌ ఉంటే వారు నామినేషన్‌నుంచి సేవ్‌ అయినట్టు. రెడ్‌ కలర్‌ వచ్చినవారునామినేట్‌ అయినట్టు బిగ్‌బాస్‌ చెప్పాడు. అందులో అభిజిత్‌, అఖిల్‌, అరియానా, అవినాష్‌ నామినేట్‌ అయ్యారు.
అయితే నామినేట్‌ అయిన వారికి మరో ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. సేవ్‌ అయిన సోహైల్‌, మోనాల్‌లో ఎవరినైనా తమ స్థానంలోకి స్వాప్‌ చేసుకోవచ్చని తెలిపారు.మొదట అవినాష్‌ తన స్వాపింగ్‌ కోసం సోహైల్‌ని రిక్వెస్ట్ చేశాడు. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత మోనాల్‌ని అడిగారు. తాను స్ట్రాంగ్‌ అని, తనతో పోల్చితే మోనాల్‌ వీక్‌అన్నాడు. ఈ విషయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇప్పుడు తాను కూడా స్టాంగ్‌ ఉన్నానని మోనాల్‌ చెప్పింది.
అఖిల్‌.. సోహైల్‌ని అడగలేదు. మోనాల్‌ని రిక్వెస్ట్ చేశారు. తనకు ఎప్పుడూ సపోర్ట్ చేయలేదని, ఇప్పుడు చేయమని చెప్పాడు. ఇంతకు ముందే ఎవరి గేమ్‌ వారు ఆడాలనినువ్వే చెప్పావని అఖిల్‌కే పంచ్‌ వేసింది మోనాల్‌. ఈ క్రమంలో మరోసారి వీరిద్దరి మధ్య గొడవ అయ్యింది. ఎవరి నిజ స్వరూపం ఏంటో తెలిసిందని, తమకి చాలా క్లారిటీఇచ్చావని అఖిల్‌ చెప్పారు. అయితే సోహైల్‌ స్వాప్‌ చేసేందుకు అఖిల్‌ వద్దకు వచ్చినా అఖిల్‌ వద్దు అని తిరస్కరించారు.
ఆ తర్వాత అరియానా..సోహైల్‌ని రిక్వెస్ట్ చేసుకోగా, వీరిద్దరి మధ్య గతానికి సంబంధించిన చర్చ జరిగింది. తనని నామినేషన్‌ చేసినా, నేను చేయలేదని సోహైల్‌ ని ఉద్దేశించిఅరియానా అంది. లాస్ట్ వీక్ చేశావని సోహైల్‌ అన్నాడు. అరియానా.. మోనాల్‌ని రిక్వెస్ట్ చేయగా, ఆమె ఒప్పుకోలేదు. ఈ క్రమంలో అరియానా కూడా మోనాల్‌ కంటే తాము స్ట్రాంగ్‌ అని, మోనాల్‌ మొదటి నుంచి గేమ్‌ ఆడలేదని తెలిపింది.
చివరగా అభిజిత్‌ వంతు రాగా.. తాను స్వాప్‌ చేసుకోవాలనుకోవడం లేదని, తాను వరుసగా నామినేట్‌ అవుతూ వస్తున్నానని, తాను కొత్తగా స్వాప్‌ చేసుకోవాలనుకోవడంలేదని తెలిపాడు. అదే సమయంలో మోనాల్‌ అమ్మ అన్న మాటని గుర్తు చేసుకుని, ఆ మాట హార్ట్ టచ్చింగ్‌గా ఉందని చెప్పాడు. అయితే కెప్టెన్‌ అయిన హారికకి ఛాన్స్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. తన పవర్‌ ఉపయోగించి స్వాప్‌ చేయండి అని చెప్పగా, మోనాల్‌ని, అభిజిత్‌ స్థానంలో స్వాప్‌ చేసింది హారిక. దీంతో ఈ వారానికిగానూ అవినాష్‌, అఖిల్‌,అరియానా, మోనాల్‌ నామినేట్‌ అయ్యారు.

Latest Videos

click me!