బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందం కోసం సర్జరీలు చేయించుకుంటున్నారా... డాక్టర్ సంచలన కామెంట్స్ 

First Published | Aug 7, 2024, 7:19 AM IST


బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తన వద్ద సర్జరీలు చేయించుకుంటారని ఓ డాక్టర్ సంచలన కామెంట్స్ చేశాడు. పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తన వద్దకు వచ్చారట. 
 

Bigg boss telugu 8

త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ 8 గురించి వస్తున్న వార్తలు ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేరు. దీనితో అంతకి మించి ఎంటర్టైన్మెంట్, హంగామా ఉండేలా నిర్వాహకులు సీజన్ 8ని ప్రిపేర్ చేస్తున్నారు. 

సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ 8 ప్రారంభం కానుంది. దీనితో కంటెస్టెంట్స్ ఎవరు అనే ఆసక్తి ఆడియన్స్ లో పెరిగిపోతోంది. ఆల్రెడీ కొందరు కంటెస్టెంట్స్ వివరాలు లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో పాపులర్ అయిన సెలెబ్రెటీలకు బిగ్ బాస్ నిర్వాహకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. 


Bigg boss telugu 8

అదే విధంగా కొందరు నటీనటులు, యాంకర్లు కూడా పాల్గొనబోతున్నారు. వివాదాల్లో ఉండేవారిపై అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది అలాంటి వారిని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్ గా ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో వినిపిస్తున్న కొన్ని పేర్లు ఆసక్తిని పెంచేస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా అలీ దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. 

Bigg Boss Telugu


అలీ తమ్ముడు కూడా కమెడియన్ గా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. అలీ తమ్ముడు ఖయ్యూం బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్ గా ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఖయ్యూం టాలీవుడ్ లో కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించాడు. బ్లేడ్ బాబ్జి లాంటి చిత్రాలు ఖయ్యుమ్ కి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అలాగే అమృత ప్రణయ్, కుమారి ఆంటీ, రీతూ చౌదరి, విష్ణుప్రియతో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. 

ఇదిలా ఉంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సర్జరీలు చేయించుకుంటున్నారట. ఈ విషయాన్ని ఓ ప్రముఖ డాక్టర్ బయటపెట్టారు. అందం కోసం కొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తన వద్దకు క్యూ కట్టారని ఆయన అంటున్నారు. ప్రతిసారి బిగ్ బాస్ సీజన్ కి ముందు సర్జరీల కోసం తన వద్దకు వస్తారట. 
 

Bigg Boss Telugu 8

నా ముక్కుకు, మూతికి సర్జరీ చేయండి అంటారట. వద్దు బాగానే ఉన్నాయని అన్నా వినరట. వాళ్లకు చేశారు. నాకు ఎందుకు చేయరు అంటారట. ఈ మేరకు ఓ డాక్టర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Latest Videos

click me!