సాధారణ ప్రేక్షకులు బిగ్ బాస్ ని చూడడానికి ప్రధాన కారణం సెలెబ్రిటీల జీవితంలోని ఆసక్తికర సంఘటనలను తెలుసుకోవడానికి. వారు కష్టనష్టాలకోర్చి ఎలా ఆ స్థాయికి చేరుకున్నారో అనే విషయాలపట్ల ప్రేక్షకులు అమితంగా ఆకర్షితులవుతారు.
ఇలాంటి విషయాల గురించి వినేఅవకాశం శుక్రవారంనాటి ఎపిసోడ్ లో వ్యూయర్స్ కి లభించింది. తమ లైఫ్ స్ట్రగుల్స్ పంచుకోమని బిగ్ బాస్ చెప్పడంతో కంటెస్టెంట్స్ అంతా కూడా తమ జీవితంలో తాము పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చారు.
ఇక శుక్రవారంనాటి ఎపిసోడ్ లో ముక్కు అవినాష్ తాను లాక్ డౌన్ కాలంలో సూసైడ్ చేసుకుందామని అనుకున్నట్టువిస్తుపోయే విషయాన్ని చెప్పాడు. తాను ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి గల కారణాలను చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు అవినాష్.
తాను జీవితంలో ప్రేక్షకులను, కుటుంబం ఈ రెంటినీ నమ్ముతానని చెప్పుకొచ్చిన అవినాష్ ఫ్రెండ్స్ ని కూడా ఫ్యామిలీగానే పరిగణిస్తానని చెప్పాడు. తనకు 30 సంవత్సరాలని... ఈ వయసులో ఒక కారు ఇల్లు కొన్నట్టు చెప్పాడు. ఇల్లు కారు కొనుక్కున్నానంటే దానికి కారణం తల్లిదండ్రులు, ప్రేక్షకులేనని చెప్పుకొచ్చాడు.
తాను కొనుక్కున్న ఇల్లు ఈఎంఐ నెలకు 45 వేల రూపాయలని, లాక్ డౌన్ కాలంలో ఈఎంఐ కట్టలేకపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డట్టుగా చెప్పుకొచ్చాడు. ఈఎంఐ కట్టలేనప్పుడు ఇల్లు ఎందుకు కొనుక్కున్నట్టు అని అనుమానం కలగొచ్చని, తాను ఈఎంఐ కట్టుకోగలనని నమ్మకం ఉండబట్టే కొనుక్కున్నట్టు వివరించాడు.
కానీ ఇదే సమయంలో తన తండ్రికి హార్ట్ స్ట్రోక్ రావడంతో అందుకు దాదాపుగా 4 లక్షల వరకు ఖర్చయిందని, ఇంటికోసం దాచిన డబ్బును ఖర్చుపెట్టేసినట్టు వివరించాడు. ఇక అంతే కాకుండా తన తల్లి మోకాళ్ళు కూడా తిరగడంతో ఆవిడ చికిత్స కోసం కూడా ఖర్చు చేసినట్టు చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో ఇల్లు తీసుకోవాలిసి రావడంతో బయట నుండి 13 లక్షలు అప్పు చేసినట్టు చెప్పుకొచ్చాడు.
తాను అప్పు చేసింది తన అమ్మానాన్నలను చూసుకోవడానికేనని, వారిని బ్రతికుండగానే సంతోషంగా చూసుకోవాలని అనుకున్నట్టుగా చెప్పాడు. ఇదే విషయాన్నీ ప్రేక్షకులకు కూడా చేతులు జోడించి చెప్పాడు.
తాను అప్పు చేసింది తన అమ్మానాన్నలను చూసుకోవడానికేనని, వారిని బ్రతికుండగానే సంతోషంగా చూసుకోవాలని అనుకున్నట్టుగా చెప్పాడు. ఇదే విషయాన్నీ ప్రేక్షకులకు కూడా చేతులు జోడించి చెప్పాడు.