బిగ్ బాస్ తెలుగు 9 లో లేటెస్ట్ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రీ ఎంట్రీ ఇచ్చిన భరణి, తనూజ మధ్య టాస్క్ లు జరిగాయి. మాధురి, తనూజ ఫుడ్ విషయంలో గొడవ పడ్డారు.
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సీజన్ 9లో చాలా డ్రామా జరుగుతోంది. ఎలిమినేట్ అయిన భరణి, శ్రీజ దమ్ము మళ్ళీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కాగా హౌస్ లో 54వ ఎపిసోడ్ వీళ్లిద్దరి చుట్టూనే సాగింది. ముందుగా మాధురి.. తనూజ మధ్య ఏర్పడిన మనస్పర్థలని చూపించారు.
25
అన్నం తినడం మానేసిన మాధురి
తనూజపై కోపంతో మాధురి అన్నం తినడం మానేసింది. దీనితో భరణి అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ఉన్నాయి. ఆమెని తినమని చెప్పండి. అందరూ తింటూ ఆమె మాత్రమే తినకుంటే నాకు బాధగా ఉంది అని భరణి అన్నారు. ఇంతలో భరణి, శ్రీజకి బిగ్ బాస్ ఒక గేమ్ నిర్వహించారు. భరణి ట్రీట్మెంట్ తీసుకుంటుండడంతో ఆయన స్థానంలో మరొకరు గేమ్ లో పాల్గొన వచ్చు అని బిగ్ బాస్ తెలిపారు. దీనితో భరణి స్థానములో దివ్య పాల్గొంది.
35
ఫుడ్ విషయంలో తనూజ, మాధురి మధ్య గొడవ
గేమ్ ప్రకారం కొన్ని బాక్స్ లని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ ఐరెన్ రూఫ్ లపై ఉంచాలి. ఈ టాస్క్ లో ఎక్కువ బాక్స్ లని దివ్య పెట్టగలిగింది. దీనితో భరణి విజయం సాధించారు. అసలు తనూజ, మాధురి మధ్య ఫుడ్ విషయంలో గొడవ వచ్చింది. తనకి ఫుడ్ తక్కువ అవుతోందని, చపాతీ ఎక్కువ పెట్టుకున్నందుకు అరిచింది అని మాధురి బాధపడింది. ఇలా నేను ఫుడ్ కోసం చస్తున్నాను అని మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాధపడతారు అని మాధురి తెలిపింది. దీనితో మాధురి, తనూజ మధ్య దూరం పెరిగింది.
ఆ తర్వాత బిగ్ బాస్ మరో టాస్క్ భరణి, శ్రీజకి నిర్వహించారు. ఈ టాస్క్ లో భరణి తరుపున ఇమ్మాన్యుయేల్, శ్రీజ తరుపున కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ టాస్క్ లో కూడా భరణి విజయం సాధించారు. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్, సంజన కూడా మాధురిని ఫుడ్ తినమని బుజ్జగించారు. కానీ ఆమె అన్నం తినడానికి నిరాకరించారు.
55
తొక్క తోటకూర నా దగ్గర మాట్లాడకు
ఆ తర్వాత కాసేపటికి తనూజ, మాధురి ఇద్దరూ కలిసి పోయారు. ఇద్దరూ జాలీగా మాటలు చెప్పుకుంటూ గడిపారు. దీనితో వాళ్ళిద్దరిపై ఇమ్మాన్యుయేల్ సెటైర్లు వేశారు. గొడవలు పడతారు వెంటనే కలిసిపోతారు.. మధ్యలో మేమంతా బకరా అవుతాం అని ఇమ్మాన్యుయేల్ అన్నారు. తనూజ మాట్లాడుతూ.. కోపం వచ్చినప్పుడు అన్నంపై అలగకూడదు అని మీరే కదా సంజనకి చెప్పారు అని మాధురిని అడిగింది. నాకు మా ఆయన మీద కోపం వచ్చినా ఫుడ్ పైనే చూపిస్తాను అని ఫన్నీగా మాధురి తెలిపింది. ఆ తర్వాత శ్రీజ, పవన్ మధ్య వాగ్వాదం జరిగింది. టాస్క్ లో పవన్ తనని, కళ్యాణ్ ని అసలు పట్టించుకోలేదని అరిచింది. నేను కంప్లీట్ గా నీ దగ్గరే కూర్చుండి పోవాలా ? కళ్యాణ్ కి దెబ్బ తగిలితే వెళ్ళాను కదా అని పవన్ చెప్పాడు. గేమ్ అయిపోయాక వచ్చావు అని శ్రీజ తెలిపింది. దీనితో పవన్ కోపంతో ఆమెపై సెటైరికల్ గా చప్పట్లు కొడుతూ హ్యాపీ న్యూ ఇయర్ అని అన్నాడు. దీనితో శ్రీజ కోపం కట్టలు తెంచుకుంది. తొక్క తోటకూర నా దగ్గర మాట్లాడకు అని పవన్ కి వార్నింగ్ ఇచ్చింది.