Pallavi Prashanth
పల్లవి ప్రశాంత్ ఒక సంచలనం అని చెప్పాలి. ఒక సాధారణ రైతుబిడ్డకు బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ రావడమే ఎక్కువ. అలాంటిది... పల్లవి ప్రశాంత్ ఏకంగా టైటిల్ సొంతం చేసుకున్నాడు. టాప్ సెలెబ్స్ ని వెనక్కి నెట్టి విన్నర్ అయ్యాడు.
బిగ్ బాస్ సీజన్ 7 డిసెంబర్ 17న ముగిసింది. అమర్ దీప్-పల్లవి ప్రశాంత్ టైటిల్ రేసులో నిలిచాడు. మెజారిటీ ఓట్లతో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. శివాజీకి మూడో స్థానం దక్కింది. ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, అర్జున్ అంబటి మిగతా స్థానాల్లో వరుసగా నిలిచారు.
ఫినాలే అనంతరం కొన్ని అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు. రెండు రోజుల రిమాండ్ అనంతరం విడుదలయ్యాడు. జైలు నుండి బయటకు వచ్చాక... ఆయన ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉన్నారు.
బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ తో విందులు, వినోదాల్లో పాల్గొంటూ ఎంజాయ్ చేశాడు. రోజుకో ప్రదేశంలో పార్టీలు చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. అదే సమయంలో మా టీవీ ఏర్పాటు చేసిన కొన్ని ఈవెంట్స్ లో పల్లవి ప్రశాంత్ పాల్గొన్నాడు.
Bigg Boss Telugu 7
పల్లవి ప్రశాంత్ తీరు చూసి... ఇలాంటి లగ్జరీ లైఫ్ చూసినవాడు వ్యవసాయం ఏం చేస్తాడని కొందరు భావించారు. అతని మూవీ ఆఫర్స్ కూడా వస్తున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ సొంత ఊరికి పోడేమో అనే సందేహాలు కలిగాయి. ఈ విమర్శలకు చెక్ పెడుతూ పల్లవి ప్రశాంత్ తాజాగా ఓ వీడియో వదిలాడు.
Pallavi Prashanth
పల్లవి ప్రశాంత్ పొలంలో పండిన పత్తిని ట్రాక్టర్ లో మార్కెట్ కి తీసుకొచ్చాడు. తానే స్వయంగా డ్రైవ్ చేశాడు. పత్తి బస్తాలు దించి కాంటా వేయించాడు. అనంతరం డబ్బులు తీసుకుని వాళ్ళ నాన్నకు ఇచ్చాడు. ఈ వీడియోను పల్లవి ప్రశాంత్ తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశాడు.
Pallavi Prashanth
పల్లవి ప్రశాంత్ ని చూసిన జనాలు చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు. ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. తిరిగి వెళుతూ ఒక టీ దుకాణం దగ్గర ట్రాక్టర్ ఆపాడు పల్లవి ప్రశాంత్. ఆ టీ కొట్టు మహిళ చాలా సంతోషపడింది. ఫోటోలు దిగింది. తాను కూడా పల్లవి ప్రశాంత్ కి ఓటు వేసినట్లు చెప్పింది.
పల్లవి ప్రశాంత్ వీడియో వైరల్ అవుతుంది. అలాగే బిగ్ బాస్ ప్రైజ్ మనీ రైతులకు పంచుతానని పల్లవి ప్రశాంత్ హామీ ఇచ్చాడు. ఇంత వరకు ఆ పని చేయలేదు. దీంతో మాట తప్పాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీటికి సమాధానంగా ప్రతి రూపాయి పేద రైతులకు పంచుతా అని పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు...