ఒకప్పటి సాయి తేజ... ప్రియాంక సింగ్ గా మారిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసే సాయి తేజ ట్రాన్స్జెండర్. బిగ్ బాస్ షో వేదికగా ఈ విషయం వెల్లడించాడు. నాన్నకు చెప్పకుండా అలా మారినందుకు క్షమాపణలు చెప్పాడు.,
ప్రియాంక సింగ్ బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్నాడు. అమ్మాయిలకు మించిన గ్లామరస్ తో ప్రేక్షకులను కట్టిపడేసాడు. ప్రియాంక సింగ్ అందంగా తయారు కావడానికి ఇష్టపడేది. మేకప్ అంటే ఆమెకు పిచ్చి.
కంటెస్టెంట్ మానస్ ని ప్రియాంక సింగ్ ఇష్టపడింది. హౌస్లో ఉన్న అందరు అబ్బాయిలను అన్నయ్య అని పిలిచేది. మానస్ ని మాత్రం అన్నయ్య అనేది కాదు. అతని చుట్టే తిరిగేది. మానస్ ఆమెతో స్నేహం కొనసాగించాడు.
హౌస్ నుండి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా హాట్ ఫోటో షూట్స్ చేస్తుంది. ప్రియాంక సింగ్ ఫోటో షూట్స్ ఒకింత బోల్డ్ గా ఉంటున్నాయి. స్కిన్ షోలో అమ్మడు హద్దులు చెరిపేస్తుంది.
దీంతో విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ఆమె ఒక ప్రైవేట్ సాంగ్ చేసింది. బాత్ టబ్ లో స్నానం చేస్తూ మైండ్ బ్లాక్ చేసింది. ఈ వీడియో మీద జనాలు నెగిటివ్ కామెంట్స్ చేశారు. దీంతో హర్ట్ అయిన ప్రియాంక సింగ్ వివరణ ఇచ్చింది.
నేను ఏం చేసినా తప్పు అంటున్నారు. ఇది నా జాబ్. మీరు ఎలాగైతే మీ పని చేసుకుంటున్నారో నేను కూడా నా పని చేసుకుంటున్నాను. నేను ఇలా చేయాల్సిందే తప్పదు. అర్థం చేసుకోండి. నా ఫస్ట్ ప్రైవేట్ సాంగ్ ఇది. త్వరలో విడుదల కాబోతుంది. మీకు నచ్చుతుందని భావిస్తున్నాను.... అని కామెంట్ చేసింది.