‘ఈట్ హెల్తీ’ అంటూ అషురెడ్డి పోస్ట్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు.. ఎందుకంటే?

First Published | Jul 10, 2023, 2:24 PM IST

బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. గ్లామర్ మెరుపులతో మతులు పోగొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా అషు ‘ఈట్ హెల్తీ’ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. అదీ వైరల్ గా మారింది.
 

డబ్ స్మాష్ వీడియోలతో ప్రారంభమైన అషురెడ్డి ప్రస్తుతం సెలబ్రెటీగా మారింది. బుల్లితెరపై సందడి చేస్తూనే ఇటు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటోంది. మరోవైపు పలు ఈవెంట్లలోనూ కనిపిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. 
 

ఇక ఎప్పటినుంచో అషురెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతూ వస్తోంది. గ్లామర్ మెరుపులతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టింది. 
 


ఇదిలా ఉంటే.. రీసెంట్ గా అషురెడ్డి పేరు టాలీవుడ్ డ్రగ్స్ కేసు లో వినిపించిన విషయం తెలిసిందే. గత నెలలో నిర్మాత కేపీ చౌదరి  ద్వారా డ్రగ్స్ కేసు తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపగా పోలీసులు వెల్లడించిన లిస్టులో అషురెడ్డి పేరు కూడా ఉన్నట్టు ప్రచారం జరిగింది 

అయితే, ఆ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని అషురెడ్డి క్లారిటీ ఇచ్చింది. తనపై వస్తున్న ఆరోపణలు ఖండించింది. ప్రస్తుతం కేసును అధికారులు విచారిస్తున్నారు. కాగా, ఆ విషయాన్ని నెటిజన్లు మాత్రం మరిచిపోవడం లేదు. 
 

తాజాగా అషురెడ్డి ఆరోగ్యంగా ఉండేందుకు హెల్తీ ఫుడ్ తీసుకోండి అంటూ ఓ పోస్ట్ పెట్టింది.అలాగే వర్కైట్ వేర్ లో గో గార్డెన్ లో కనిపించింది. గ్రాస్ పై కూర్చొని ఫ్రూట్స్ తింటూ ఫొటోలకు ఫోజులిచ్చింది.  ‘మనం ఎంత తక్కువ తెలుసుకుంటే అంత ఎదుగుతాం’ అంటూ ఆసక్తికరంగా క్యాప్షన్ కూడా ఇచ్చింది. అలాగే Eat Healthy అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జతచేసింది.
 

దీంతో ఈ పోస్టు చూసిన నెటిజన్లు ఇంట్రెస్టింగ్ గా కామెంట్లు పెడుతున్నారు. అషురెడ్డిని పరోక్షంగా ట్రోల్ చేస్తున్నారు.  ‘నేను డ్రగ్స్ తింటా.. నాకు డ్రగ్స్ కావాలి.. నాకు డ్రగ్స్ అవసరం’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరో నెటిజన్ ‘డ్రగ్స్  ఆపండి’ అంటూ అషురెడ్డి పోస్ట్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మిగతా వారు ఫూట్స్ తింటున్న అషురెడ్డి బ్యూటీ సీక్రెట్ ఇదేనేమో అంటూ పొగుడుతున్నారు. 
 

Latest Videos

click me!