యువరాణిలా అరియానా గ్లోరీ.. సంప్రదాయ దుస్తులు, ఆభరణాల్లో మెరిసిపోతున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ

First Published | Aug 21, 2023, 6:20 PM IST

‘బిగ్ బాస్’ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory)   సోషల్ మీడియాలో ఎంతగా యాక్టివ్ గా కనిపిస్తుందో తెలిసిందే. వరుసగా పోస్టులు పెడుతూ అభిమానులతో పాటు నెటిజన్లను తనవైపు ఆకర్షించుకుంటోంది. బ్యూటీఫుల్ లుక్స్ లో దర్శనమిస్తూ కట్టిపడేస్తోంది. 
 

‘బిగ్ బాస్’ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory)   సోషల్ మీడియాలో ఎంతగా యాక్టివ్ గా కనిపిస్తుందో తెలిసిందే. వరుసగా పోస్టులు పెడుతూ అభిమానులతో పాటు నెటిజన్లను తనవైపు ఆకర్షించుకుంటోంది. బ్యూటీఫుల్ లుక్స్ లో దర్శనమిస్తూ కట్టిపడేస్తోంది. 
 

యంగ్ బ్యూటీ ప్రస్తుతం గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. వరుస పెట్టి ఫొటోషూట్లు చేస్తూ అందాల విందు చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూనే.. సంప్రదాయ దుస్తుల్లోనూ అందాల విందు చేస్తోంది. గ్లామర్ ధాటితో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
 


కొద్దికాలంగా అరియానా వరుస ఫొటోషూట్లతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల బొద్దుగా మారిన ఈ ముద్దుగుమ్మ నయా లుక్స్ లో మెరుస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. గ్లామర్ మెరుపులతో యువతను చిత్తు చేస్తోంది. 
 

తాజాగా అరియానా గ్లోరీ సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. బ్లూ లెహంగా, వోణీలో బ్యూటీపుల్ లుక్ ను సొంతం చేసుకుంది. డ్రెస్ కు మ్యాచింగ్ అయ్యే ఖరీదైన జ్యువెల్లరీ ధరించి యువరాణిలా మారిపోయింది. కొత్త లుక్ తో కట్టిపడేస్తోంది. 

లేటెస్ట్ ఫొటోషూట్ కు సంబంధించిన ఓ వీడియోను తాజాగా అభిమానులతో పంచుకుంది. మత్తుగా ఫొటోలకు ఫోజులిస్తూ మైమరిపించింది. నడుము అందంతో చూపుతిప్పుకోకుండా చేసింది. నిషా కళ్లతో కుర్ర హృదయాలకు గాలం వేస్తోంది. 

ఇప్పటికే సోషల్ మీడియాలో అరియానా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుతూ వస్తోంది. అందాల వల విసురుతూ మరింతగా క్రేజ్ సంపాదిస్తోంది. ఇన్ స్టాలో ఈ బ్యూటీకి వన్ మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉండటం విశేషం. ఆ సంఖ్యను మరింతగా పెంచేందుకు బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తోంది. 
 

అరియానా అందమైన ఫొటోలకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఈ ముద్దుగుమ్మను మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. లేటెస్ట్ ఫొటోషూట్ ను నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు. ఆమె అందాన్నిపొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 

ఇదిలా ఉంటే.. అరియానా యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈటీవీ అభిరుచి, తదితర షోలతో పాటు య్యూటూబ్ ఛానెళ్లకు యాంకర్ గా వ్యవహరించి ఆడియెన్స్ ను అలరించింది. ఫైనల్ గా సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ఇంటర్యూతో గుర్తింపు దక్కించుకుంది. 
 

ఆ క్రేజ్ తో కింగ్, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న Bigg Boss Telugu లో అవకాశం దక్కించుకుంది. ఏకంగా సీజన్ 3, సీజన్ 5లో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. ఆ తర్వాత ‘బీబీ కెఫే’, ‘బీబీ జోడీ’ వంటి షోలతోనూ అలరించింది. అటు సినిమాల్లోనూ వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. నటిగా మారేందుకు ప్రయత్నిస్తోంది. 
 

Latest Videos

click me!