యంగ్ బ్యూటీ భానుశ్రీ తన కేరీర్ ను సీరియల్స్ తోనే ప్రారంభించింది. ‘జాబిలమ్మ’,‘వాణి రాణి’ వంటి తెలుగు డైలీ సీరియల్స్ లో మెరిసి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అలాగే నటిగానూ ఆయ చిత్రాల్లో అవకాశాలు అందుకుంది.
గతంలో వచ్చిన ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’, ‘ఇద్దరి మధ్య 18’, కుమారి 21ఎఫ్, బాహుబలి, కటమారాయుడు’ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో మెరిసింది. అలా సంపాదించుకున్న కాస్తా క్రేజ్ తో ‘బిగ్ బాస్ తెలుగు’ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
కింగ్ నాగార్జున్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న Bigg Boss Telugu రెండో సీజన్ లోనే భాను శ్రీ కి అవకాశం దక్కింది. ఈ షోలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకోవడంతో పాటు బుల్లితెర ప్రేక్షకులకు మరింతగా అలరించింది. హౌజ్ నుంచి బయటికి వచ్చాక మరింత సందడి చేస్తోంది.
‘బిగ్ బాస్’ హౌజ్ నుంచి బయటికి వచ్చాక భానుశ్రీకి టాలీవుడ్ లో హీరోయిన్ గా అవకాశాలు అందుతుండటం విశేషం. ఇప్పటికే ‘ఏడు చేపల కథ’, ‘బ్రేకింగ్ న్యూస్’ చిత్రాల్లో మెరిసింది. హీరోయిన్ గా ‘నల్లమల’తో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మరోవైపు సోషల్ మీడియాలోనూ భాను శ్రీ రచ్చరంభోలా చేస్తోంది. నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగే లక్ష్యంగా స్టన్నింగ్ ఫొటోషూట్లు వస్తోంది. భాను శ్రీ ఫొటోషూట్లకు నెటిజన్ల మతులు పోతున్నాయి. అయితే త్వరలో తన సినిమా రిలీజ్ ఉండటంతో ఇలా నెట్టింట రచ్చ చేస్తోంది.
తాజాగా బ్లాక్ మినీ డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. పొట్టి దుస్తుల్లో నిలువెత్తు అందాలను ప్రదర్శిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. మరోవైపు థైస్ అందాలతో పిచ్చెక్కించింది. స్టన్నింగ్ స్టిల్స్ తో మైండ్ బ్లాక్ చేసింది. లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతోంది.
స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట సందడి చేస్తున్న భానుశ్రీ మోడ్రన్ లుక్ లో స్టార్ హీరోయిన్ లా మెరిసిపోతోంది. యంగ్ బ్యూటీ గ్లామర్ మెరుపులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఫొటోలను లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ ‘ఈ అమ్మాయి ఈఎంఐ’ చిత్రంలో నటించింది. ఈసినిమా ట్రైలర్ రీసెంట్ గా విడుదలై ఆకట్టుకుంటోంది. దొంతు రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.