బిగ్ బాస్ షో తెలుగులో ముగిసింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడో సీజన్ బిగ్ బాస్ షోకి హైప్ వచ్చింది. ఆదరణ దక్కింది. కంటెస్టెంట్లు ఆ రేంజ్‌లో గేమ్స్ ఆడటం, గొడవలు పడటం షోని రక్తికట్టించేలా చేసింది. ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశాయి. మొత్తానికి ఈ సారి బిగ్ బాస్ షో అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌ని సాధించింది. మొన్న ఫైనల్ ఈవెంట్‌లో నాగార్జున కూడా ఇదే విషయాన్ని చెప్పారు.
మొత్తానికి బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ముగిసింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. అమర్‌దీప్ రన్నరప్‌గా నిలిచాడు. విన్నర్ అవుతాడనుకున్న శివాజీ మూడో స్థానానికే పరిమితమయ్యాడు. యావర్ నాల్గో స్థానంలో 15 లక్షల ఆఫర్‌తో వెళ్లిపోయాడు. ప్రియాంక, అర్జున్‌లకు మిగిలింది పారితోషికాలే.
అయితే గతంలో ఎప్పుడూ లేనంతగా బిగ్ బాస్ పై చర్చ జరిగింది. హైప్ వచ్చింది. క్రేజ్ వచ్చింది. షో విషయంలో నిర్వాహకులు అంతా హ్యాపీ. ఈ షోని `స్టార్ మా` నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. గత ఐదు సీజన్లుగా ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. గత సీజన్ల విషయంలో, హోస్ట్ గా నాగార్జున విషయంలోనూ వ్యతిరేకత ఎదురైంది. దీంతో ఈ సారి ఉల్టా పుల్టా అంటే ట్విస్ట్ లు, సర్‌ప్రైజ్‌లతో షోని నడిపించారు. సక్సెస్ అయ్యారు.
అయితే ఇంతటి ఆదరణ పొందుతున్న ఈ షో వెనుక అసలు కథ వేరే ఉంది. షోకి కర్త, కర్మ, క్రియ వేరే ఉన్నారు. వాళ్లే దీన్ని మొత్తాన్ని శాషిస్తున్నారట. బిగ్ బాస్ వెనుక బిగ్ షాట్స్ ఉన్నారనే విషయం బయటకు వచ్చింది. బిగ్ బాస్ షో ని నిర్వహించేది స్టార్ మానే, కానీ దాన్ని వెనుకాల ఉండ నడిపించేది మాత్రం ఆ బిగ్ షాట్స్ అని తెలుస్తుంది. ఇదంతా పెద్ద వ్యాపారం అని తెలుస్తుంది. దీనిపై వందల కోట్ల బిజినెస్ జరుగుతుందని టాక్.
Photo credit - star maa
`బిగ్ బాస్` షోని నడిపించేవాళ్లు ఎన్‌ఆర్‌ఐలు అని టాక్. దాదాపు 12 మంది కార్పొరేట్లు ఈ షోని శాసిస్తున్నారట. వాళ్లు.. స్టార్ మాతో 12ఏళ్ల అగ్రిమెంట్ అని తెలుస్తుంది. ఈ పన్నెండేళ్లు ఈ షోని స్టార్ మా వాళ్లు నిర్వహించాల్సి ఉంటుందట. దీనికి ఏడాదికి కొంత అమౌంట్‌ని స్టార్ మాకి ఇస్తారని సమాచారం. మొత్తానికి ఓ ఫిగర్‌కి అగ్రిమెంట్ అయ్యిందని, అది ఏడాది ఏడాది ఇస్తుంటారట. ఒక్కో సీజన్ నిర్వహలనుకు సుమారు యాభై నుంచి ఆరవై కోట్లు అవుతుందని టాక్. ఏడాదికి 80-100కోట్ల స్టార్ మా అగ్రిమెంట్ అని సమాచారం.
ఈ అమౌంట్‌లో నుంచే స్టార్ మా వాళ్లు.. బిగ్ బాస్ సెట్, అందులో ఫర్నిచర్, మొత్తం అరెంజ్ చేసుకోవాలి. కంటెస్టెంట్లకి పారితోషికం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే హోస్ట్ నాగార్జున పారితోషికం కూడా అందులోనే అని టాక్. నాగ్‌కి 15-20కోట్ల వరకు ముడుతుందని తెలుస్తుంది. ఇందులో సగం అమౌంట్ నిర్వహణ ఖర్చు పోతే మరో సగం స్టార్ మా నిర్వహకులకు మిగులుతుందని తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ షోకి వచ్చే స్పాన్సర్లు, యాడ్స్ అన్నీ ఆ `బిగ్ షాట్స్`కే వెళ్తుంది. యాడ్స్ లో నిర్వహకులకు ఏ సంబంధం లేదు.
Photo credit - star maa
ప్రతి సీజన్‌కి వందల కోట్ల యాడ్స్ వస్తాయి. అవన్నీ ఆ ఎన్ఆర్‌ఐలకే వెళ్తుందని తెలుస్తుంది. అయితే వాళ్లు 12 మంది టీమ్ అని, ఆ కార్పొరేట్లు కలిసి ఈ షోని డిజైన్ చేస్తారని, వాళ్లే ఏది ఎలా ఉండాలనేది నిర్ణయిస్తారని సమాచారం. ఇలా ఈ బిగ్ బాస్ వెనుక వందల కోట్ల వ్యాపారం జరుగుతుందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతా? అనేది తెలియాల్సి ఉంది. పైన పేర్కొన్న ఫిగర్స్ అంచనా మాత్రమే, స్పష్టమైన లెక్కలు తెలియాల్సి ఉంది. కానీ ఆడియెన్స్ ఇంట్రెస్ట్ వెనుక కార్పొరేట్ల(బిగ్ షాట్స్) అతిపెద్ద వ్యాపారం ఉండటం గమనార్హం.