అమీర్‌ ఖాన్‌ సినిమాకి షాక్‌.. `బైకాట్‌ లాల్‌ సింగ్‌ చడ్డా` యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌

Published : Aug 02, 2022, 11:52 AM ISTUpdated : Aug 02, 2022, 11:55 AM IST

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌ సినిమాకి కొత్త కష్టాలు వెంటాడుతున్నాయి. ఆయన నటించిన `లాల్‌ సింగ్‌ చడ్డా`ని బ్యాన్‌ చేయాలంటూ నెటిజన్లు కొందరు రచ్చ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు సోషల్‌ మీడియాలో రచ్చ అవుతుంది.   

PREV
16
అమీర్‌ ఖాన్‌ సినిమాకి షాక్‌.. `బైకాట్‌ లాల్‌ సింగ్‌ చడ్డా` యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌

అమీర్‌ ఖాన్‌(Aamir Khan) వరుస పరాజయాలతో ఉన్నారు. ఆయన చివరగా నటించిన రెండు సినిమాలు పరాజయం చెందాయి. `సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌`, `థగ్స్ ఆఫ్‌ హిందూస్థాన్‌` చిత్రాలు పరాజయం చెందాయి. ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా `లాల్‌ సింగ్ చడ్డా`(Lal Singh Chaddha)ని రూపొందించారు. ఇది హాలీవుడ్‌ ఫిల్మ్ `ఫారెస్ట్ గంప్‌`కి రీమేక్‌. ఆగస్ట్ 11న సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. హిందీతోపాటు తెలుగులోనూ రిలీజ్‌ చేస్తున్నారు. సౌత్‌ భాషల్లోనూ ఈ సినిమాని రిలీజ్‌కి ప్లాన్‌ జరుగుతుంది.  

26

తాజాగా ఈ సినిమాకి కొత్త కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలని, `బైకాట్‌ లాల్‌ సింగ్‌ చడ్డా` అనే యాష్‌ ట్యాగ్ లు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. అంతేకాదు గతంలో అమీర్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు వైరల్‌ చేస్తున్నారు. కరీనా కపూర్‌ కామెంట్స్ ని కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఇందులో కరీనా కపూర్‌ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. 
 

36

గతంలో అమీర్‌ ఖాన్‌ `శివలింగంపై పాలు పోయడం వృథా, దాని బదులు పేద పిల్లలకు ఇవ్వాలని కామెంట్‌ చేశారు అమీర్‌. మరోవైపు అసహనంపై కామెంట్లు చేశారు. దేశంలో అసహనం పెరిగిపోతుందని, తాము, తమ భార్య దేశం విడిచి పారిపోవాలనుకుంటున్నట్టు కామెంట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పుడు దుమారం రేపాయి. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. 
 

46

దీంతో ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్‌కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను తెరపైకి తీసుకొచ్చి ట్రోల్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. `బైకాట్‌ లాల్‌ సింగ్‌ చడ్డా` అనే యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్‌ చేస్తున్నారు. `లాల్‌ సింగ్‌ చడ్డా` సినిమా చూడకండి, ఆ మనీతో పేద పిల్లలకు చదువుకి వాడండి అంటూ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. 

56
Aamir Khan

మరోవైపు కరీనా కపూర్‌ కామెంట్లు సైతం ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఆమె `మా సినిమాలను చూడకండి. సినిమాలు చూడాలని మిమ్మల్ని ఫోర్స్ చేయడం లేదు` అని వ్యాఖ్యానించిందని, దాన్ని తెరపైకి తీసుకొస్తూ మరింత రచ్చ చేస్తున్నారు. దీంతో ఇంటర్నెట్‌లో అమీర్‌ ఖాన్‌ సినిమాపై పెద్ద స్థాయిలో రచ్చ జరుగుతుంది. అయితే ఈ వివాదం ఓ రకంగా సినిమాకి మైనస్‌గా మారుతున్నా, మరోవైపు ప్లస్‌ అవుతుండటం విశేషం. ఈ సినిమాపై అంతకు ముందు ఈ స్థాయిలో బజ్‌ లేదు. ఓ రకంగా ఆ బజ్‌ని క్రీయేట్‌ చేస్తున్నారనే కామెంట్లు వస్తున్నాయి. మరి ఈ బైకాట్‌, బ్యాన్‌ల ప్రభావం సినిమాపై ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. 

66

ఇక అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగచైతన్య కీలక పాత్రలో నటించారు. బాలరాజు బోడి అనే సైనికుడిగా కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు. తెలుగులో గట్టిగా ప్రమోట్‌ చేసిన విషయం తెలిసిందే. మరి ఈ స్థాయిలో సినిమా ఆకట్టుకోబోతుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories