ప్రభాస్ సినిమాలో ప్రత్యేక పాత్రలో భూమిక, ఏపాత్ర చేయబోతుందటే...?

Published : Dec 10, 2022, 10:15 PM IST

టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్లు  సందడి చేయబోతున్నాయి. అందులో కొన్ని రేర్ కాంబోలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే యంగ్ రెబల్ స్టార్ ఫ్యాస్స్ ఔరా అనేలా మరో కాంబో తెరపై సందడి చేయబోతోంది.  

PREV
18
ప్రభాస్ సినిమాలో ప్రత్యేక పాత్రలో భూమిక,  ఏపాత్ర చేయబోతుందటే...?

టాలీవుడ్ లో డిఫరెంట్ కాంబో తెరపై సందడి చేయబోతోంది. ఇప్పటికే చాలా కొత్త కాంబోలు టాలీవుడ్ ఆడియన్స్ ను.. సర్ ప్రైజ్ చేయగా.. ఇప్పుడు మరో సర్ ప్రైజ్ కాంబో  తెరపై సందడి చేయబోతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో భూమిక నటించబోతున్నట్టు తెలుస్తోంది.  

28

ప్రభాస్ హీరోగా మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న రాజా డీలక్స్ సినిమాలో భూమిక ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే భూమిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయగా.. కొన్ని సెలెక్టెడ్ సినిమాల్లో మాత్రమే ఆమె నటిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే నాని వదినగా, నటించింది. అంతే కాదు తన ఫస్ట్ హీరోసుమంత్ తో రీసెంట్ గా సీతారామం సినిమాలో మెప్పించింది బ్యూటీ. 

38

సూపర్ నేచురల్ హారర్ కామెడీ  సినిమాగా తెరకెక్కుతోంది ప్రభాస్ - మారుతీ సినిమా. ఈ మూవీలో ప్రభాస్ సరసన ముగ్గరు హీరోయిన్లు నటిస్తుండగా.. ఈ మూవీలో సీనియర్ నటి భూమిక చావ్లా కీలకపాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈమూవీలో భూమిక ప్రభాస్ అక్కగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. 

48

సుమంత్ హీరోగా నటించిన  యువకుడు మూవీతో హీరోయిన్ గా  తెలుగు తెరకి పరిచయమైన భూమిక.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషితో  స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.  ఇక వరుసగా  ఒక్కడు, సింహాద్రి,  సినిమాలతో టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ సాధించుకుంది బ్యూటీ. 
 

58

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ సీనియర్ హీరోల  పక్కన ఆడిపాడిన భూమిక పెళ్లి తర్వాత  సినిమాలకు దూరం అయ్యింది.  నేచురల్ స్టార్ నానీ  హీరోగా వచ్చిన ఎమ్సీఏ సినిమాతో మళ్లీ తెరపైకి వచ్చిన భూమికా  సెకండ్ ఇన్నింగ్స్ లో కాస్త ఆలోచించి అడుగులు వేస్తోంది.

68
Bhumika Chawla

 బాలయ్య రూలర్, పాగల్, సీటీమార్, ఇదే మా కథ సినిమాల్లో నటించి సీనియర్ బ్యూటీ రీ సెంట్ గా .. తన ఫస్ట్ సినిమా హీరో సుమంత్‌కి జతగా ఇటీవలే  సీతా రామం మూవీలో కనిపించింది.. 

78

అటు వైపు టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా  రేంజ్ లో దూసుకెళ్తున్నాడు. వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో సందడి చేస్తున్నారు.. బాలీవుడ్ డెబ్యూ మూవీ ఆదిపురుష్ రిలీజ్ కు ముస్తాబుతుండగా... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ పోస్ట్ ప్రోడక్షన్ లో ఉంది. దానితో పాటు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ – K లైన్ లో ఉండగా...  సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కూడా రెడీ అవుతోంది. ఈ మధ్యలోనే  మారుతి దర్శకత్వంలో సైలెంట్‌గా ఓ సినిమా షూటింగ్ మొదలు పెట్టేశాడు ప్రభాస్. 

88

 ఇక ప్రభాస్ – మారుతి సినిమా విషయానికొస్తే.. కథలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన హీరో సిస్టర్ క్యారెక్టర్ ఆమె చేయనుందని అంటున్నారు. ప్రభాస్‌కి అక్కగా భూమిక కనిపించనుంది.. కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని వార్తలు వినిపిస్తున్నాయి..
 

Read more Photos on
click me!

Recommended Stories