పొలిటికల్ గా పవన్ కి బాలయ్య షాకింగ్ ఆఫర్, చాలా కాలం తర్వాత తిక్క వచ్చింది.. సినిమాలు మానేస్తాడా..

Published : Feb 05, 2023, 07:33 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ ఆహాలో ఇటీవల స్ట్రీమింగ్ మొదలయింది. అంతా ఊహించినట్లుగానే రికార్డులు బ్రేక్ చేస్తూ బాలయ్య పవన్ మొదటి ఎపిపోడ్ దూసుకుపోతోంది.

PREV
16
పొలిటికల్ గా పవన్ కి బాలయ్య షాకింగ్ ఆఫర్, చాలా కాలం తర్వాత తిక్క వచ్చింది.. సినిమాలు మానేస్తాడా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ ఆహాలో ఇటీవల స్ట్రీమింగ్ మొదలయింది. అంతా ఊహించినట్లుగానే రికార్డులు బ్రేక్ చేస్తూ బాలయ్య పవన్ మొదటి ఎపిపోడ్ దూసుకుపోతోంది. బాలయ్య గోలని, పవన్ కళ్యాణ్ ప్రజెన్స్ ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 

26

అదే జోష్ లో ఆహా టీం వీళ్లిద్దరి రెండవ ఎపిసోడ్ రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. ఫిబ్రవరి 10న సెకండ్ ఎపిసోడ్ ప్రీమియర్ కానుంది. దీనితో తాజాగా రెండవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. తొలి ఎపిసోడ్ మొత్తం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, కుటుంబం, సినిమాల గురించి ఉంది. కానీ రెండవ ఎపిసోడ్ లో బాలయ్య పవన్ ని పూర్తిగా పొలిటికల్ సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు. 

 

36

పవన్ ని తికమక పెట్టేలా బాలయ్య సూటి ప్రశ్నలు సంధించారు. అసలు పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ? అని ప్రశ్నించారు. దీనితో పవన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చినట్లు ఉన్నాడు. ఆ బాలయ్య పవన్ కి రాజకీయంగా ఊహించని ఆఫర్ ఇస్తూ ఒక ప్రశ్న అడిగారు. నువ్వు తెలుగుదేశంలో చేరి ఉండొచ్చు కదా అని అన్నారు. దీనికి పవన్ ఎలాంటి సమాధానం ఇస్తారనే ఉత్కంఠ ప్రోమోతో పెరిగింది. 

46

పవన్ కళ్యాణ్ ఆ మధ్యన ఇప్పటం గ్రామానికి వెళుతున్నప్పుడు కారు టాప్ పై ప్రయాణించడం పెద్ద వివాదమే సృష్టించింది. బాలయ్య ఆ ఫోటో చూపిస్తూ ఏంటి ఈ గొడవ అని అడిగారు. దీనికి పవన్.. కారులో కూర్చోకూడదు, నడిచి వెళ్ళకూడదు, కారుపై అభివాదం చేయకూడదు, రూమ్ లో కూడా ఉండకూడదు.. అందుకే చాలా కాలం తర్వాత కొంచెం తిక్క వచ్చింది అంటూ వైసిపి ప్రభుతం తనపై విధించిన ఆంక్షలని ఉద్దేశించి సమాధానం ఇచ్చారు. 

56

రాష్ట్రంలో నీ అభిమాని కానివారు అంటూ లేరు. కానీ ఆ అభిమానం ఓట్లుగా ఎందుకు మారలేదు ? మీ మ్యానిఫెస్టో ప్రజల్లోకి పూర్తిగా వెళ్లిందా ? లాంటి పొలిటికల్ ప్రశ్నలని బాలయ్య సంధించారు. ఒక వృద్ధురాలు వేదికపైకి వచ్చి పవన్ ని ఆప్యాయంగా కౌగిలించుకోవడం.. పవన్ ని తన కొడుకుగా అభివర్ణించడం ఎమోషనల్ గా ఉంది. 

66

బాలయ్య, పవన్ షోకి మరో గెస్ట్ గా హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఎంటర్ అయ్యారు. ఒక పులి, సింహం మధ్యలో తన తల ఉన్నట్లుగా ఉంది అంటూ నవ్వులు పూయించారు. ఇక నుంచి పవన్ సినిమాలు మానేసి ప్రజాసేవకు పూర్తిగా అంకితం అవ్వాలి అని బాలయ్య అడగగా.. ప్రేక్షకుల నుంచి అవును అని సమాధానం వచ్చింది.. మరి దీనికి పవన్ ఎలా స్పందిచాడో ఎపిసోడ్ చూసే తెలుసుకోవాలి. అణువుని కూడా ఇరుకున పెడితే అణుబాంబు అవుతుంది అని బాలయ్య చెప్పడం.. వాహ్ అని పవన్ స్పందించడం ఆకట్టుకుంటున్నాయి. కొద్దిక్షణాలోనే ఈ ప్రోమో వైరల్ గా మారింది. 

Read more Photos on
click me!

Recommended Stories