సీనియర్‌ యాక్టర్‌తో అనుష్క ఎఫైర్‌.. దేవసేనతో ప్రభాస్‌ బ్రేకప్‌?

First Published | Mar 3, 2023, 10:52 AM IST

అనుష్క.. ప్రభాస్‌ లవ్‌ ఉన్నట్టు, పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు చాలా సార్లు రూమర్స్ వచ్చాయి. అయితే వీరిద్దరు వాటిని ఖండిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఓ షాకింగ్‌ విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. 
 

ప్రభాస్‌, అనుష్క కలిసి ఇప్పటి వరకు మూడు సినిమాల్లో నటించారు. `బిల్లా`తో ఫస్ట్ టైమ్‌ జోడీ కట్టి ఈ జంటకి మంచి పేరొచ్చింది. ఇద్దరి పర్సనాలిటీ ఒకేలా ఉండటం, చూడ్డానికి జంట బాగుండటంతో అభిమానులు ఈ జంటని బాగా ఆదరించారు. సినిమాతో సంబంధం లేకుండా వీరికి హిట్‌ పెయిర్‌గా ముద్ర వేశారు. 

`బిల్లా` తర్వాత `మిర్చి`లో కలిసి నటించారు. ఇందులో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ముదిరిపోయింది. ఇక `బాహుబలి` రెండు పార్ట్ లతో వీరి కెమిస్ట్రీ, రిలేషన్‌ షిప్‌ పీక్‌లోకి వెళ్లిందన్నారు. ఈ ఇద్దరు ఘాటు ప్రేమలో మునిగితేలుతున్నారనే వార్తలొచ్చాయి. ఒకటి రెండు ఫంక్షన్లలోనూ కలిసి కనిపించడం ఆ రూమర్స్ కి మరింత బలం చేకూరినట్టయ్యింది. ఆ మధ్య ఈ ఇద్దరు పెళ్లికి సిద్ధమయ్యారనే వార్తలొచ్చాయి. అందులో నిజం లేదని ఫ్యామిలీ మెంబర్స్ ఖండిస్తూ వచ్చారు. తాము మంచి స్నేహితులం మాత్రమే అని ప్రభాస్‌ చెబుతూ వచ్చారు. 
 


అయినా వీరిపై రూమర్స్ ఆగడం లేదు. తాజాగా ఈ ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకున్నారనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. అనుష్క తీరు విషయంలో ప్రభాస్‌ హర్ట్ అయ్యాడని, అందుకే ఆమెకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. కారణం అనుష్క.. ఓ సీనియర్‌ యాక్టర్‌తో చనువుగా ఉంటుందని, ఇద్దరి మధ్య ఎఫైర్‌ నడుస్తుందనే విషయం ప్రభాస్‌కి చేరిందట. ఆ విషయం తెలిసినప్పట్నుంచి అనుష్కకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట డార్లింగ్‌. అనుష్క మోసాన్ని భరించలేక తాను సైడ్‌ అయిపోయాడట ప్రభాస్‌. 
 

మరి అనుష్క ఎవరితో చనువుగా ఉంటుందని, ఆ సీనియర్‌ యాక్టర్‌ ఎవరనేది పెద్ద ప్రశ్న. అనుష్క చివరగా `సైలెంట్‌` చిత్రంలో నటించింది. అందులో ఆర్‌ మాధవన్‌తో కలిసి నటించింది. అంతకు ముందు `భాగమతి` చేసింది. అందులో జయంరామ్‌, ఉన్నిముకుందన్‌లతో కలిసి నటించింది. అంతకు ముందు `బాహుబలి`లోనే నటించింది. మరి సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న ఆ సీనియర్‌ యాక్టర్‌ ఎవరనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. 

ఇదిలా ఉంటే ఇందులో నిజమెంతా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ప్రభాస్‌, అనుష్క రిలేషన్‌షిప్‌లో ఉన్నారా అనేది పెద్ద ప్రశ్న. తాము స్నేహితులమనే చెప్పిన ఈ జంట మధ్య ప్రేమ, బ్రేకప్‌లకు ఛాన్స్ ఉందా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న అయితే, అసలు అనుష్క సీనియర్‌ యాక్టర్‌లతో ఎఫైర్‌ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటనేది ఆమె అభిమానుల నుంచి వినిపిస్తున్న వాదన. ఇది రూమరేనా? ఇందులో నిజం ఉందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. ఏదేమైనా ఇప్పుడు అనుష్క, ప్రభాస్‌ బ్రేకప్‌ అనే వార్త సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తుండటం విశేషం. 
 

ఇక ప్రస్తుతం నాలుగు సినిమాలతో క్షణంగా తీరికలేకుండా ఉన్నారు ప్రభాస్‌. ఆయన `ఆదిపురుష్‌`, `సలార్‌`, `ప్రాజెక్ట్ కే`, మారుతితో `రాజా డీలక్స్` చిత్రాలు చేస్తున్నారు. ఏక కాలంలో మూడు సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఇంతటి బిజీ షెడ్యూల్స్ లో ఆయన ఎఫైర్స్ నడిపించే టైమ్‌ ఉందా? అనేది ఓ వాదన. మరోవైపు అనుష్క చాలా గ్యాప్‌ తర్వాత ఇప్పుడు కుర్ర హీరో నవీన్‌ పొలిశెట్టితో కలిసి `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` చిత్రంలో నటిస్తుంది. 
 

Latest Videos

click me!