
అనుపమా పరమేశ్వరన్ క్యూట్ అందాలతో మెప్పిస్తుంది. కర్లీ హెయిర్‌తో కుర్రాళ్లని గిలిగింతలు పెడుతుంది. నాజూకు నడుముతో రెచ్చగొడుతుంది. కవ్వించే చూపులతో సెగలు రేపుతుంది. టోటల్ అన్ని యాంగిల్స్ లో ఆకర్షిస్తూ, ఆకట్టుకుంటూ తన చుట్టూ తిప్పుకుంటుంది. మరోవైపు వరుసగా విజయాలు అందుకుంటూ ఆడియెన్స్ కి దగ్గరవుతుంది. లక్కీ హీరోయిన్ గా మారిపోతుంది.
2022లో అనుపమా తన జోరుని చూపించింది. ఏడాది ప్రారంభంలో `రౌడీ బాయ్స్`తో బోల్డ్ రోల్ చేసి ఆకట్టుకుంది. ఇందులో లిప్ కిస్ సీన్‌లో, రొమాంటిక్ సీన్లలో నటించి షాకిచ్చింది. అందరిని ఆశ్చర్యపరిచింది. సాంప్రదాయానికి పెద్ద పీట వేసే ఈ భామ ఇలా బోల్డ్ సీన్లలో నటించడం షాక్‌కి గురి చేసింది. దీంతోపాటు `కార్తికేయ2`తో పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటింది. అనుపమా పాపులర్ అయిపోయింది. నిఖిల్‌తో కలిసి నటించి హిట్ అందుకుందీ క్యూట్ బ్యూటీ.
మరోసారి ఈ కాంబినేషన్‌తోనే సక్సెస్ ని అందుకున్నారు. వీరిద్దరు కలిసి నటించిన `18పేజెస్` చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలందుకుంది. అయితే ఇది ప్యూర్ లవ్ స్టోరీ కావడంతో ఏ సెంటర్ ఆడియెన్స్ కి పరిమితమైంది. మాస్‌లోకి వెళ్లలేకపోయింది. అయినా సుమారు రూ.25కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో యూనిట్‌కి పెద్దగా నష్టాలు లేవని తెలుస్తుంది. ఇందులో అనుపమా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. నిఖిల్ కంటే ఈ బ్యూటీకే ఎక్కువ పేరొచ్చింది.
మరోవైపు ఇటీవల `బట్టర్ ఫ్లై` అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలోనూ నటించింది అనుపమా. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తున్నా, అనుపమాకి ప్రశంసలు దక్కాయి. ఇలా అనుపమా గ్రాఫ్ పెరుగుతూ వస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్లు, నటన పరంగా ప్రశంసల నేపథ్యంలో అనుపమా క్రేజ్ పెరిగింది. ఇమేజ్ పెరిగింది. దీంతో దాన్ని క్యాష్ చేసుకునేందుకు రెడీ అవుతుంది.
అనుపమా ఇప్పుడు పారితోషికం పెంచేసిందట. రెమ్యూనరేషన్ డబుల్ చేసేందట. అంతకు ముందు అనుపమా ఒక్కో సినిమాకి యాభై లక్షల వరకు తీసుకునేదట. సినిమా రేంజ్‌ని బట్టి, పాత్రని బట్టి ఉండేదట. ఇప్పుడు 1.20 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని సమాచారం. కొత్త సినిమాలకు కోటికిపైగానే పారితోషికం అడుగుతుందనే సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇండస్ట్రీలోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణంగా సక్సెస్ వస్తే స్టార్లు రెమ్యూనరేసన్ పెంచేస్తారు, ఇప్పుడు అనుపమా కూడా అదే చేస్తుందని అంటున్నారు. అయితే ఆమెకి వస్తోన్న పేరు, సక్సెస్ నేపథ్యంలో నిర్మాతలు అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమే అంటున్నారని టాక్.
అదే సమయంలో సినిమాలు, పాత్రల విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తుందట. సహజంగానే మలయాళ భామలు అన్ని రకాల సినిమాలు చేయరు. తమ పాత్రకి ప్రయారిటీ ఉంటేనే చేస్తారు. గ్లామర్ డోస్‌కి దూరంగా ఉండే పాత్రలే చేస్తారు. అనుపమా కూడా అదే చేస్తుందని టాక్. ఇక ప్రస్తుతం అనుపమా చేతిలో ఓ తమిళ సినిమా, ఓ మలయాళ మూవీ ఉంది. ఇటీవల `టిల్లు స్వ్కైర్`లో హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. కానీ కొన్ని కారణాలతో తప్పుకుంది. ప్రస్తుతం పలు తెలుగు సినిమాలకు చర్చలు జరుగుతున్నట్టు టాక్.