
తాజాగా హాట్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. పూల పూల చీరకట్టి హోయలు పోయింది. క్లీవేజ్ అందాలను చూపిస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో అను ఇమ్మాన్యుయెల్ గ్లామర్ షో అదిరిపోయేలా ఉంది.
డోర్ వద్ద వొంపుసొంపుల అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. నెటిజన్లని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు కిల్లింగ్ లుక్స్ తో మరింతగా కట్టిపడేస్తుంది. హాట్‌నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే ఈ భామ ఇప్పుడు సోషల్ మీడియాలో చీర అందాలతో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.
ఇదిలా ఉంటే ఈ సెక్సీ బ్యూటీ మెహందీని ఎంజాయ్ చేస్తుంది. ఓ ఫంక్షన్‌లో ఆమె మెహందీ పెట్టుకుంటూ కనిపించింది. మెహందీ ఆర్టిస్టు చేత తన చేతులకు మెహందీ పెట్టుకుంటూ దిగిన ఫోటోలను సైతం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. దీంతో ఇవి వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ టైమ్‌లో అను ఇమ్మాన్యుయెల్ మెహందీ పెట్టుకోవడం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. మహాశివరాత్రి సందర్భంగా ఇలా చేసిందా? లేక తన ఫ్యామిలీలో ఫంక్షన్ సందర్భంగా మెహందీ ధరిస్తుందా? అనేది ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఇదిలా ఉంటే నెటిజన్లు మాత్రం ఓ అడుగు ముందుకేసి ఏకంగా గుడ్ న్యూస్ చెప్పబోతున్నావా అంటూ కామెంట్లు పెడుతుండటం విశేషం. పెళ్లి కబురు ఏదైనా ఉందా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. దీంతో ఇప్పుడు నెట్టింట అను ఇమ్మాన్యుయెల్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
చాలా రోజుల తర్వాత అను ఇలా సోషల్ మీడియాలో మెరవడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆదివారం పూట అను తన అభిమానులకు ఇలా ట్రీట్ ఇచ్చిందంటున్నారు. సంబర పడుతున్నారు. హాట్ అందాలతో, కిల్లింగ్ పోజులతో మత్తెక్కించే ఈ బ్యూటీ గ్లామర్ షో చేసే అది నెక్ట్స్ లెవల్ ఉంటుందని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం అను ఇమ్మాన్యుయెల్ .. మాస్ మహారాజా రవితేజతో కలిసి `రావణాసుర` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు షురూచేశారు. పాటలు విడుదల చేస్తున్నారు. త్వరలో ఈ బ్యూటీ మీడియా ముందుకు రాబోతుందని చెప్పొచ్చు.
మరోవైపు ఇటీవల అల్లు శిరీష్‌తో కలిసి `ఊర్వశివో రాక్షసివో` చిత్రంలో నటించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో లిప్ లాక్‌లు, రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది అను ఇమ్మాన్యుయెల్. అల్లు శిరీష్‌తో పిచ్చెక్కించేలా కెమిస్ట్రీ పండించింది. ఆడియెన్స్ కి సైతం షాకిచ్చింది.
ఇదిలా ఉంటే ఈ ఇద్దరు లవ్ లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. శిరీష్, అను ఇమ్మాన్యుయెల్ ప్రేమలో మునిగితేలుతున్నారని, అందుకే ఈ చిత్రంలో నటించారని,అందుకే సినిమాలో ఆ స్థాయిలో కెమిస్ట్రీ పండించగలిగారనే ప్రచారం జరిగింది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే తమ మధ్య వస్తోన్న ఎఫైర్ రూమర్లపై ఈ ఇద్దరు ప్రత్యక్షంగా స్పందించకపోవడం గమనార్హం.
ఇక నానితో `మజ్ను` చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అను ఇమ్మాన్యుయెల్. తొలి చిత్రంతోనే హిట్ అందుకుంది. ఆ తర్వాత `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`, `ఆక్సీజన్`, `అజ్ఞాతవాసి`, `నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా`, `శైలజారెడ్డి అల్లుడు`, `అల్లుడు అదుర్స్`, `మహాసముద్రం` వంటి చిత్రాల్లో నటించింది. ఇందులో ఒక్క సినిమాకూడా ఆడలేదు. దీంతో అను ఇమ్మాన్యుయెల్ క్రేజ్ కూడా తగ్గింది. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు `రావణాసుర` చిత్రంలో నటిస్తుంది. అలాగే తమిళంలో `జపాన్` అనే సినిమా చేస్తుంది.