సింగర్ సునీత ప్రీ వెడ్డింగ్ వేడుకలో సుమ రచ్చ.. వైరల్ అవుతున్న డాన్స్ వీడియో!

First Published Jan 26, 2021, 5:30 PM IST

టాలీవుడ్ లో ఈ మధ్య జరిగిన వివాహాలలో సింగర్ సునీత వివాహం హాట్ టాపిక్ అయ్యింది. 42ఏళ్ల సునీత రెండో వివాహం చేసుకోవడం ఒకింత కొందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనితో సునీత వివాహం జనవరి 9న ఘనంగా జరిగింది.

సునీత వివాహంపై సోషల్ మీడియా వేదికగా అనేక కామెంట్స్ వినిపించాయి. కొందరు పాజిటివ్ గా మరికొందరు నెగిటివ్ గా స్పందించడం జరిగింది. మెజారీ నెటిజెన్స్ సునీతకు మద్దతుగా  నిలవడం విశేషం.
undefined
ఎవరు ఏమనుకున్నా సునీత ఆనందంగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.  నిశ్చితార్ధ కార్యక్రమం సింపుల్ గా ముగించిన రామ్-సునీత ప్రీ వెడ్డింగ్ వేడుకలతో పాటు పెళ్లి ఘనంగా చేసుకున్నారు.
undefined
రామ్ సునీతల పెళ్ళికి బుల్లితెర, వెండితెర ప్రముఖులతో పాటు రాజకీయ వేత్తలు హాజరయ్యారు.
undefined
సునీత బంధువులు, స్నేహితులు ఆ వీడియోలో సందడి చేయగా విశేషత సంతరించుకుంది.  సునీత ప్రీ వెడ్డింగ్ వేడుకలలో స్టార్ యాంకర్ సుమ పాల్గొన్నారు. సునీత పెళ్లి వేడుకలలో సుమ డాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
undefined
సునీత యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసిన తన ప్రీ వెడ్డింగ్ వీడియోలో సుమ ఎనర్జిటిక్ గా కనిపించారు. ఆమె సునీత మరియు బంధువులతో కలిసి డాన్స్ చేశారు.
undefined
ఇక ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా ఉన్నారు. కూతురు ఆద్యతో పాటు ఆమె సునీత ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యారు.
undefined
ఇక ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా ఉన్నారు. కూతురు ఆద్యతో పాటు ఆమె సునీత ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యారు.
undefined
ఇద్దరు పిల్లలతో సునీత వేడుకను ఆస్వాదిస్తున్న క్షణాలను ఆ వీడియోలో మనం చూడవచ్చు.
undefined
మొత్తంగా సునీత ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారడంతో ఆమె ఫ్యాన్స్  ఆస్వాదిస్తున్నారు.
undefined
click me!