కుర్రాళ్ళు కాదు.. అంకుల్స్ ని టార్గెట్‌ చేసిన హాట్‌ యాంకర్‌ శ్రీముఖి..

First Published | Dec 26, 2020, 8:48 PM IST

బొద్దుగుమ్మ, హాట్‌ అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి అంకుల్స్ ని టార్గెట్‌ చేసింది. కుర్రాళ్లని అస్సలు పట్టించుకోని ఈ హాట్‌ బేబి యాభై ఏళ్ళ అంకుల్స్ తో రొమాన్స్ చేస్తుంది. దీంతో తన అభిమానులను షాక్‌కి గురి చేస్తుంది. మరి శ్రీముఖి అంకుల్స్ ని టార్గెట్‌ చేయడానికి కారణమేంటనేది చూస్తే, 

తెలుగులో ప్రముఖ యాంకర్‌గా రాణిస్తున్న శ్రీముఖి `బొమ్మ అదిరింది`, `ఓ వుమానియా` వంటి షోస్‌ చేస్తూ అలరిస్తుంది.
మరోవైపు అప్పుడప్పుడు `జీ తెలుగు` నిర్వహించే స్పెషల్‌ షోలో మెస్మరైజ్‌ చేస్తుంటుంది. ప్రస్తుతం కొత్త సంవత్సరం కోసం `పార్టీకి వేళాయేరా`లో దుమ్మురేపేలా లుంగీ డాన్స్ చేసింది. దీంతోపాటు `సరిగమపా`కి హోస్ట్ గా చేస్తుంది.

టీవీలోనే కాదు అడపాదడపా సినిమాలు చేస్తూ తన బిగ్‌ స్క్రీన్‌ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.
అందులో భాగంగా హాట్‌ అందాల భామ శ్రీముఖి హీరోయిన్‌గా మారింది. తాను లీడ్‌గా `క్రేజీ అంకుల్స్ ` చిత్రంలో నటిస్తుంది.
అయితే సినిమాల్లోనే తాను సినీ స్టార్‌గా నటిస్తుండటం విశేషం. ఇందులో ఈ అమ్మడు అంకుల్స్ తో రొమాన్స్ చేయడం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది.
శ్రీముఖి ముగ్గురు అంకుల్స్ తో ఇందులో ఘాటు రొమాన్స్ లో మునిగితేలుతున్నట్టు తాజాగా విడుదలైన ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. సినీ తారల సైడ్‌ బిజినెస్‌కి సంబంధించిన వాటిపై సెటైరికల్‌గా ఈ సినిమాని రూపొందించినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాకి ఈ సత్తిబాబు దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో ముగ్గురు అంకుల్స్ గా రాజారవీంద్ర, మనో, భరణి, పోసాని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విడుదలైన ట్రైలర్‌ ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది.
ఇందులో శ్రీముఖి హవాభావాలు, చీరలో అందాలను ఆరబోస్తూ తమ అభిమానులకే షాక్‌ ఇచ్చింది శ్రీముఖి.
ఎప్పుడూ బుట్టబొమ్మలా ఉండే శ్రీముఖి ఇలా మరింత ఘాటుగా తయారు కావడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
కుర్ర హీరోలతో నటించే వయసులో, అంకుల్స్ తో సినిమా చేయడం చర్చనీయాంశంగా మారింది. అలాంటి అవసరం ఏంటనే టాక్‌ వినిపిస్తుంది. మరి శ్రీముఖి ప్రయత్నం ఎలాంటి టర్న్ లు తీసుకుంటుందో చూడాలి.

Latest Videos

click me!