Sreemukhi: కొత్త షో కోసం కత్తిలా రెడీ అయిన శ్రీముఖి... ఎద అందాలతో కవ్వించే పోజులు!

First Published | Nov 30, 2023, 4:37 PM IST

యాంకర్ శ్రీముఖి కొత్త షో స్టార్ట్ చేసింది. ఈ షో కోసం ఆమె సరికొత్తగా తయారైంది. ఆరంజ్ కలర్ ట్రెండీ వేర్లో శ్రీముఖి అందాలు కళ్ళు జిగేల్ అనిపిస్తున్నాయి. 
 

Sreemukhi

శ్రీముఖి ఖాతాలో మరో కొత్త షో చేరింది. ఆహా వేదికగా కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ నేటి నుండి స్ట్రీమ్ కానుంది. ఈ షోకి యాంకర్ గా శ్రీముఖి వ్యవహరించనుంది. కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ షోలో దర్శకుడు అనిల్ రావిపూడి సైతం సందడి చేయనున్నాడు. ఆయన జడ్జిగా వ్యవహరిస్తారట. 
 

Sreemukhi

ఇది సీజన్ 2 గత సీజన్ హిట్ కావడంతో సెకండ్ సీజన్ స్టార్ట్ చేశారు. నాన్ స్టాప్ నవ్వులతో పాటు శ్రీముఖి గ్లామర్ తో షో హోరెత్తనుంది. శ్రీముఖి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. కామెడీ ఎక్స్ఛేంజ్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ కోసం శ్రీముఖి కత్తిగా సిద్ధమైంది. 


Sreemukhi

కాగా శ్రీముఖి కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆమె పలు షోలలో సందడి చేస్తుంది. శ్రీముఖి యాంకరింగ్ చేస్తున్న స్టార్ మా ఆదివారం పరివార్ షో టాప్ రేటెడ్ షోలలో ఒకటిగా ఉంది. ఈ షోకి మంచి ఆదరణ దక్కుతుంది. 

Sreemukhi

యాంకర్ గా శ్రీముఖి అనతి కాలంలో ఎదిగారు. పటాస్ షోతో పాప్యులర్ అయిన శ్రీముఖి ప్రస్తుతం అరడజను షోల వరకూ చేస్తుంది. సుమ కూడా షోలు తగ్గించేశారు. అనసూయ యాంకరింగ్ వదిలేసింది. ఇది శ్రీముఖికి ప్లస్ అయ్యింది. 

Sreemukhi

మరోవైపు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తుంది. ఇటీవల విడుదలైన భోళా శంకర్ చిత్రంలో శ్రీముఖి వ్యాంప్ రోల్ చేసింది. ఖుషి మూవీ స్పూఫ్ సీన్ లో చిరంజీవితో పాటు రొమాన్స్ కురిపించింది. 
 

Sreemukhi

హీరోయిన్ గా ఎదగాలనేది శ్రీముఖి కోరిక. అవకాశాలు వస్తున్నా ఆచితూచి ఎంచుకుంటుంది. చిన్నా చితకా చిత్రాలు చేయడం వలన ఎలాంటి ప్రయోజనం లేదని ఆమె భావిస్తున్నారు. 

Sreemukhi

క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించింది. భరణి, రాజా రవీంద్ర, సింగర్ మను ప్రధాన పాత్రలు చేయగా శ్రీముఖి గ్లామరస్ రోల్ లో అలరించింది. క్రేజీ అంకుల్స్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. 

Sreemukhi

కెరీర్లో సెటిల్ అయిన శ్రీముఖి రెండు చేతులా సంపాదిస్తుంది. ఆమె సంపాదన లక్షల నుండి కోట్లకు చేరింది. హైదరాబాద్ లో సొంత ఇల్లు నిర్మించుకుంది. కుటంబ సభ్యులతో పాటు అక్కడే ఉంటుంది. 
 

Sreemukhi

తరచుగా శ్రీముఖి పెళ్లి రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ మధ్య హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్తతో పెళ్లి అంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ రూమర్స్ పై శ్రీముఖి మండిపడింది. నిరాధార ఆరోపణలు అంటూ కొట్టిపారేసింది. 

Sreemukhi

శ్రీముఖి బిగ్ బాస్ షోలో పాల్గొనడం విశేషం. సీజన్ 3లో పాల్గొన్న శ్రీముఖి ఫైనల్ కి వెళ్ళింది. ఆమెకు టైటిల్ తృటిలో చేజారింది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలవగా, శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. 

Latest Videos

click me!