మత్తు పదార్థంలా మారిన శ్రీముఖి.. ఇంత దగ్గరగా చూస్తే మైకమే.. అదిరిపోయే గౌన్ లో కిర్రాక్ పోజులు..

First Published | Apr 22, 2023, 11:50 AM IST

స్టార్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi) బ్యూటీఫుల్ లుక్స్ లో దర్శనమిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు మైమరిపిస్తోంది. నెట్టింట అందాల మత్తు వెదజల్లుతూ మంత్రముగ్ధులను చేస్తోంది. లేటెస్ట్ లుక్ అదిరిపోయింది.
 

బుల్లితెరపై అందాల యాంకర్ గా శ్రీముఖి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన చలకీతనం, సమయస్ఫూర్తి, దూసుకుపోయే గుణంతో టీవీ ఆడియెన్స్ లో క్రేజ్ దక్కించుకుంది. అనతికాలంలోనే తన నైపుణ్యంతో స్టార్ యాంకర్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. 
 

ప్రస్తుతం శ్రీముఖి కేరీర్ కు ఎలాంటి ఢోకా లేదు. బ్యాక్ టు బ్యాక్ టీవీషోలతో అలరిస్తూనే వస్తోంది. ఎప్పుడూ మూడునాలుగు షోలతో బుల్లితెరపై సందడి చేస్తూనే వస్తోంది. గతంలో ‘పటాస్’తొ యాంకర్ గా అడుగుపెట్టి ఆ తర్వాత చాలా షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిచింది.
 


అలాగే పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’లోనూ అడుగుపెట్టింది.  సీజన్ 3లో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత సీజన్ 4లోనూ మెరిసింది. దీంతో ఎంటర్ టైన్ మెంట్ రంగంలో శ్రీముఖి క్రేజ్ అమాంత పెరిగింది. దీంతో వరుస షోను దక్కించుకుంటూ వస్తోంది. 
 

‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’, ‘డాన్స్ ఐకాన్’, ‘మిస్టర్ అండ్ మిస్సెస్’, ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్’ వంటి టీవీషోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బుల్లితెరపై సందడి చేస్తోంది.  తన క్రేజ్ ను అంతకంతకు పెంచుకుంటోంది. 

ఇదిలా ఉంటే.. శ్రీముఖి సోషల్ మీడియాలోనూ ఎంతలా యాక్టివ్ గా ఉంటుందో తెలిసిన విషయమే. టీవీ షోలు,  అటు ఈవెంట్లు, సినిమాలతో బిజీగా ఉంటున్నా.. నెట్టింట మాత్రం తన అభిమానులకు మాత్రం టచ్ లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంది.
 

ఈక్రమంలోనే శ్రీముఖి అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ మైమరిపిస్తోంది. నయా లుక్స్ లో దర్శనమిచ్చి అదరగొడుతోంది. తన ఫ్యాషన్ సెన్స్ ను చూపిస్తూ గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తూ నెట్టింట రచ్చ  చేస్తోంది.  తాజాగా శ్రీముఖి ఫొటోషూట్ వైరల్ గా మారింది. 

లేటెస్ట్ లుక్ లో శ్రీముఖి బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. అదిరిపోయే గౌన్ లో హోయలు పోయింది. రెట్రో లుక్ లో రెడీ అయ్యి ఆకట్టుకుంది. ట్రెండీ గౌన్ లో మెరిసిన శ్రీముఖి ఫొటోలకు అదిరిపోయేలా ఫోజులిచ్చింది. కుర్రగుండెల్ని కొల్లగొట్టే స్టిల్స్ తో కట్టిపడేసింది.
 

మరోవైపు కెమెరాకు దగ్గరగా  అందాలను ఆరబోసింది. మత్తు చూపులతో మైకం తెప్పించింది. క్లోజప్ షార్ట్ లో శ్రీముఖి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఫ్యాన్స్ ఫొటోలను లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక శ్రీముఖి అటు సినిమాల్లోనూ మెరుస్తోంది. చిరంజీవి ‘భోళా శంకర్’లో కీలక పాత్రలో కనిపించనుంది. 
 

Latest Videos

click me!