రష్మీకిది `గుంటూరు టాకీస్‌` లాంటి బోల్డ్ రోల్‌ అవుతుందా?..ఆశలన్నీ నాగ్‌పైనే..

First Published | May 27, 2021, 10:21 AM IST

అనసూయకి ఓ రకంగా లైఫ్‌ ఇచ్చాడు నాగార్జున. ఇప్పుడు రష్మీకి ఇవ్వబోతున్నాడా? ఆశలన్నీ ఆయనపైనే పెట్టుకుందా? ఇంతకి అది `గుంటూరు టాకీస్‌` లాంటి రోల్‌ అవుతుందా? సెక్సీ యాంకర్‌ విషయంలో ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌.

తనకు `గుంటూరు టాకీస్‌` లాంటి హిట్‌ చిత్రాన్ని అందించిన ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో మరోసారి రష్మీ కలిసి పనిచేయబోతుందట. నాగార్జునతో ఆయన రూపొందించబోతున్న సినిమాలో రష్మీ నటించబోతుందని టాక్‌.
ఇందులో మెయిన్‌ హీరోయిన్‌గా కాజల్‌ ఎంపికయ్యారు. ఓ కీలక పాత్రలో రష్మీ కనిపిస్తారని తెలుస్తుంది. అయితే అది ఎలాంటి పాత్ర అనేదానిపై హాట్‌ హాట్‌గా చర్చ జరుగుతుంది.

గతంలో `గుంటూరు టాకీస్‌`లో రష్మీ బోల్డ్ రోల్‌ చేసి తన అందాలతో అందరిని మెస్మరైజ్‌ చేసింది రష్మీ. అందులో సువర్ణగా రష్మీ కేకపెట్టించింది.
మళ్లీ తనకు సినిమాల్లో అంతటి గుర్తింపు రాలేదు. దీంతో సినిమాల్లో రాణించాలనే కోరిక ఇంకా తీరకుండానే ఉంది రష్మీకి. ఈ నేపథ్యంలో మరోసారి ఆమెకి మంచి లైఫ్‌ ఇవ్వాలని డిసైడ్‌ అయ్యాడట ప్రవీణ్‌ సత్తారు. అందుకే నాగ్‌ చిత్రంలో ఆమెని కీలక పాత్ర కోసం తీసుకున్నారని టాక్.
అయితే ఇందులోనూ ఆమె రోల్‌ బోల్డ్ గానే ఉంటుందా? లేక డిఫరెంట్‌గా ఉంటుందా అనేది సస్పెన్స్ గా మారింది.
మరోవైపు `సోగ్గాడే చిన్ని నాయనా`లో యాంకర్‌ అససూయకి మంచి లైఫ్‌ ఇచ్చాడు నాగ్‌. ఇప్పుడు రష్మీకి కూడా లైఫ్‌ ఇవ్వబోతున్నాడా? రష్మీ కూడా నాగ్‌, ప్రవీణ్‌ సత్తార్‌లపైనే ఆశలు పెట్టుకుందా? అన్నది తెలియాల్సి ఉంది.
రష్మీ ప్రస్తుతం `జబర్దస్త్` షోకి యాంకర్‌గా చేస్తుంది. దీంతోపాటు `ఢీ` షోలో క్వీన్స్ టీమ్‌కి లీడర్‌గా వ్యవహరిస్తుంది.ప్రస్తుతం ఆమె `బొమ్మ బ్లాక్‌బస్టర్‌` చిత్రంలో నందుతో కలిసి నటిస్తుంది.
రష్మీ థ్రోబ్యాక్‌ గ్లామర్‌ ఫోటోలు.
రష్మీ థ్రోబ్యాక్‌ గ్లామర్‌ ఫోటోలు.

Latest Videos

click me!