బుల్లితెర ప్రేక్షకుల్లో స్టార్ యాంకర్ గా రష్మీ గౌతమ్ మంచి గుర్తింపు దక్కించుకుంది. పదేళ్లుగా స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే వెండితెరపైనా మెరుస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తోంది.
అయితే, ఇటీవల రష్మీ గౌతమ్ నెట్టింట కాస్తా అరుదుగా పోస్టులు పెట్టింది. అటు నటిగానూ సినిమాలు చేస్తుండటంతో కాస్తా గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక మళ్లీ యాక్టివ్ గా కనిపిస్తోంది. వరుసగా పోస్టులు పెడుతూ తన అభిమానులు ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా రష్మీ గౌతమ్ స్టన్నింగ్ ఫొటోషూట్లు చేస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇప్పటికే ట్రెండీ, ట్రెడిషనల్ వేర్ లో గ్లామర్ మెరుపులు మెరింపించింది. ఇక తాజాగా లెహంగా వోణీలో బ్యూటీఫుల్ లుక్ లో దర్శనమిచ్చింది.
తాజాగా రష్మీ గౌతమ్ పంచుకున్న ఫొటోల్లో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. బ్లూ కలర్ ఫ్లవర్ ప్రింటెండ్ లెహంగా వోణీ ధరించి మరింత అందాన్ని సొంతం చేసుకుంది. పైగా మతులు పోయేలా ఫొటోలకు ఫోజులిచ్చి కంటిచూపు తిప్పుకోకుండా చేసింది.
అన్ని యాంగిల్లో ఫోజులిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. సంప్రదా దుస్తుల్లో పద్ధతిగా మెరిసినా అదిరిపోయే స్టిల్స్ తో యాంకర్ అందాల ప్రదర్శన మాత్రం నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరోవైపు మత్తు చూపులతో మెస్మరైజ్ చేసింది.
ఇక రష్మీ గౌతమ్ ఇలా గ్లామర్ ఫొటోలను, సినిమా అప్డేట్, తన షో డిటేయిల్స్ ఇవ్వడంతో పాటు అటు సామాజిక అంశాలపైనా స్పందిస్తూ ఉంటారు. పైగా పెట్స్ సంరక్షణ కోసం ఎప్పటికప్పుడు పలు సూచనలు సలహాలు చేస్తుంటారు. దీంతో ఈ బ్యూటీకి నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది.
రష్మీ గౌతమ్ యాంకర్ గా పరిచయం కావడం కంటే ముందే.. నటిగా పలు చిత్రాల్లో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఫైనల్ గా ‘జబర్దస్త్’ కామెడీ షోకు యాంకర్ గా వ్యవరించడంతో ఫేమ్ దక్కించుకుంది. ప్రస్తుతం హీరోయిన్ గానూ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
‘గుంటూరు టాకీస్’, ’నెక్ట్స్ నువ్వే’, ‘అంతకు మించి’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ హీరోయిన్ దక్కాల్సినంత క్రేజ్ మాత్రం దక్కలేదు. ఒక్క సాలిడ్ హిట్ పడితే రష్మీ కూడా బుల్లితెరకు గుడ్ బై చెప్పడం ఖాయమంటున్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి ‘భోళా శంకర్’లో కీలక పాత్రలో నటిస్తోంది.