బుల్లితెరపై స్టార్ యాంకర్ గా అనసూయ తనదైన ముద్ర వేసుకుంది. సక్సెపుల్ కామెడీ షో ‘జబర్దస్త్’తో యాంకర్ గా తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. మరోవైపు యాంకరింగ్ స్కిల్స్, చలాకీతనం, చురుకుగా వ్యవహరించే తీరు, అందంతో అనతికాలంలోనే స్టార్ సెలెబ్రెటీగా మారిపోయింది.
ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అనసూయ. అలాగే అభిమానులతో తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. రీసెంట్ గా సంక్రాంతి సంబురాల్లో ఫ్యామిలీతో కలిసి సందడి చేసింది. అయితే అనసూయ ఎలాంటి పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అలాగే, తాజాగా తను పోస్టు చేసిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో అనసూయ తమ ఇంటి బయట ఉన్న ఓ పపాయ చెట్టు నుంచి పండిన పపాయాలను తెంచుతూ ఉంటుంది. ఇందుకోసం ఏకంగా గోడ ఎక్కి చేతితో ఫ్రూట్స్ ను తెంపుతుంది.తర్వాత తాజా పొప్పడి పండును ముక్కలుగా కట్ చేసి తింటూ రుచికరంగా ఉందంటూ చెబుతుంది. ఇక ఆర్గానిక్ ఫ్రూట్స్ ను తింటూ తన గ్లామర్ ను కాపాడుకుంటున్నట్టు ఇండైరెక్ట్ గా తెలిపింది.
దీంతో అనసూయ సౌందర్యమైన చర్మ రహస్యం ఇదేనేమో అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. నిజానికి పపాయాలోని విటమిన్స్, పలు పోషకాలతో చర్మం మెరిసిపోతుందని సంబంధిత వైద్యులు కూడా చెబుతూనే ఉంటారు. ఈ క్రమంలో అనసూయ తన బ్యూటీని మరింత గ్లో చేసుకునేందుకు తాజా పండ్లను తింటూ ఉంటుందని వీడియో ద్వారా తెలియజేసింది. వెండితెరపై మెరవాలంటే బ్యూటీని ఎప్పుడూ కాపాడుకునేందుకు యాక్ట్రెస్ కు ఇలా కష్టాలు తప్పవు. ఇక ఆ వీడియోకు ఓ మోటివేషనల్ మ్యూజిక్ ను కూడా జతచేసింది.
ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉంటూ నటిగా వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తోంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటోంది. చేతి నిండా సినిమాలతో అనసూయ ఫుల్ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం తను నటిస్తున్న చిత్రాల నుంచి కూడా వరుస అప్డేట్స్ అందుతున్నాయి.
యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న ‘మైఖేల్’ చిత్రంలో అనసూయ ‘ది మ్యాడ్ క్వీన్’ చారులతగా అలరించబోతోంది. ఫిబ్రవరి 3న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రంగమార్తాండ’ అనే చిత్రంలోనూ నటిస్తోంది. దాక్షయణిగా ‘పుష్ఫ’లో ఆకట్టుకున్న అనసూయ Pushpa2లోనూ నటిస్తోంది. సీక్వెల్ ఎలా అలరించబోతుందనేది ఆసక్తిని పెంచుతోంది.