అనసూయ లేటెస్ట్ లుక్ అదుర్స్.. ట్రెడిషనల్ వేర్ లో స్టార్ బ్యూటీ మైండ్ బ్లోయింగ్ పోజులు..

First Published | Mar 19, 2023, 3:43 PM IST

జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం సినిమాలతోనే బిజీ అవుతున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు నెట్టింట కూడా సందడి చేస్తోంది. క్రేజీ పోస్టులతో ఆకట్టుకుంటోంది.
 

బుల్లితెర అందాల యాంకర్ గా అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఆడియెన్స్ లో ఎంతటి క్రేజ్ దక్కించుకున్నారో తెలిసిందే. యాంకరింగ్ తో పాటు స్మాల్ స్క్రీన్ పై గ్లామర్ ఒళకబోస్తూ యూత్ లో గట్టి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.
 

అనసూయ క్రేజ్ కు దెబ్బకు సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో వెండితెరపైనా స్పెషల్ అపియరెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఐటెం సాంగ్స్ లలో మెరిసి మైమరిపింది. ‘రంగస్థలం’, ‘క్షణం’, ‘పుష్ఫ : ది రైజ్’ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 
 


ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. దీంతో ‘జబర్దస్త్’షో కూడా మానేసిన విషయం తెలిసిందే. దీంతో అనసూయ అభిమానులు, బుల్లితెర అభిమానులు ఆమెను ఎంతగానో మిస్ అవుతున్నారు. మునుపటిలా స్మాల్ స్క్రీన్ పై రోజూ సందడి చేసే అవకాశం లేకపోవడంతో అప్సెట్ అవుతున్నారు. 
 

ఇక తన అభిమానుల కోసం అనసూయ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెండితెరపై అలరిస్తూనే ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటోంది. క్రేజీ పోస్టులు పెడుతూ ఖుషీ చేస్తోంది. మరోవైపు ఆయా ఈవెంట్లు, ప్రారంభోత్సవాలకు హాజరవుతూ కనువిందు చేస్తోంది. 
 

తాజాగా పలాస నగరంలోని  ఓ మాల్ ఓపెనింగ్ కు వెళ్లిన అనసూయ ఇలా స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. పింక్ అవుట్ ఫిట్ లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. మత్తు చూపులు, మతిపోయే పోజులతో ఆకట్టుకుంది. ప్రస్తుతం అనసూయ పంచుకున్న ఈ ఫొటో రీల్ నెట్టింట వైరల్ అవుతోంది. అభిమానులు ఆమె లేటెస్ట్ లుక్ ను పొడుతూ లైక్స్, కామెంట్లు పెడుతున్నారు. 

ప్రస్తుతం అనసూయ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్ గా సందీప్ కిషన్ ‘మైఖేల్’ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ప్రస్తుతం ‘రంగమార్తండ’ చిత్రంతో అలరించనుంది. అలాగే అల్లు అర్జున్ ‘పుష్ప : దిరూల్’ చిత్రంలో విలన్ గా మరోసారి అలరించబోతోంది. మున్ముందు మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లలో మెరిసే అవకాశం ఉంది.

Latest Videos

click me!