సినిమాల్లోకి అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, స్టార్ హీరో సినిమాతో తెరంగేట్రం చేయబోతున్న అల్లు వారి కోడలు

First Published | Nov 3, 2022, 9:17 PM IST

ఇప్పటికే చాలా మంది స్టార్ వారసులు ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇక ఇప్పుడు స్టార్ హీరోల భార్యలు కూడా ఇండస్ట్రీ వైపు చూస్తున్నారు. ఈ విషయంలో ముందడుగు వేయబోతుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి. త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. 
 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. అల్లు ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు తెరపై సందడిచేస్తున్నారు. బన్నీ పిల్లలు కూడా నటిస్తున్నారు. ఇక అల్లు లేడీస్ కూడా ఇక మీద వెండి తెరపై సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. బన్నీ భార్య స్నేహా రెడ్డి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. 

Sneha Reddy

సోషల్ మీడియాలో స్నేహా రెడ్డి చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ తో, పిల్లలతో ఉన్న ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ వచ్చిన స్నేహా.. ఇక ఈ మధ్య తన ఫోటో షూట్స్ తో సండి చేస్తూ వచ్చింది. హీరోయిన్ల ను మించిన అందంతో ఇన్ స్టాలో హాట్ హాట్ ఫోటోలు అప్ లోడ్ చేస్తోంది.  


స్నేహ రెడ్డి హీరోయిన్ రేంజ్ లో ఫోటోషూట్ లు చేస్తూ వాటిని అభిమానులతో పంచుకుంటారు. అయితే ఇప్పుడు స్నేహ రెడ్డికి ఓ మలయాళ సినిమాలో నటించే అవకాశం దక్కింది అంటూ టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అందులో ఆమె ఏ పాత్ర పోషించబోతుంది అన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. 

హీరోయిన్ గా చేసే అవకాశం లేదు.. మరి క్యారెక్టర్ రోల్ చేస్తుందా.. లేకు ఏదైనా ఇంపార్టెన్స్ ఉన్న బ్యటీ రోల్ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సాధించిన స్నేహా.. ఇక వెండితెరపై అభిమనులను సంపాధించే పనిలో ఉన్నట్టు సమాచారం. 
 

అల్లు అర్జున్ కు మలయాళంలో యమా క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ తోనే బన్నీ భార్యకు ఈ అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ త్వరలో పుష్ప సీక్వెల్ మూవీ షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నాడు. అటు స్నేహీ రెడ్డి మలయాళంలో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కాని. ఇదే నిజం అయితే.. అల్లు వారి జంట ప్లానింగ్స్ చాలా పెద్దగనే ఉన్నట్టు అనుకోవాలి. 

Latest Videos

click me!