Allu Arjun: బాలీవుడ్ స్టార్ హీరోలకు అల్లు అర్జున్ షాక్.. పుష్ప దెబ్బకు టీఆర్పీ రికార్డ్స్ బద్దలు

Published : Apr 01, 2022, 12:50 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం దేశం మొత్తాన్ని ఊపేసింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ యాక్టింగ్ స్టైల్, డాన్స్, యాటిట్యూడ్ కి నార్త్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. 

PREV
16
Allu Arjun: బాలీవుడ్ స్టార్ హీరోలకు అల్లు అర్జున్ షాక్.. పుష్ప దెబ్బకు టీఆర్పీ రికార్డ్స్ బద్దలు
Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం దేశం మొత్తాన్ని ఊపేసింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ యాక్టింగ్ స్టైల్, డాన్స్, యాటిట్యూడ్ కి నార్త్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. నార్త్ లో పుష్ప చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో చిత్రికరించబడింది. 

26
Allu Arjun

ఎర్రచందనం కూలీగా ఆ తర్వాత సిండికేట్ కి డాన్ గా ఎదిగిన పాత్రలో బన్నీ నటించాడు. పార్ట్ 2లో అసలైన పోరాటం ఉండబోతోంది. పుష్ప పార్ట్ 2ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే పయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పుష్ప మొదటి భాగం మ్యానియా ఇంకా కొనసాగుతూనే ఉంది. 

36
Allu Arjun

ఇటీవల పుష్ప హిందీ వర్షన్ ని టెలివిజన్ లో ప్రీమియర్స్ ప్రదర్శించారు. పుష్ప తో పాటు ఇతర ఛానల్స్ లో అక్షయ్ కుమార్ సూర్య వంశీ, రణ్వీర్ సింగ్ 83 చిత్రాలని కూడా టివిలో ప్రదర్శించారు. అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ హిందీలో స్టార్ హీరోలు. కానీ ఊహించని విధంగా అల్లు అర్జున్ పుష్ప చిత్రం ఈ రెండు చిత్రాల టీఆర్పీని అధికమించి అగ్ర స్థానంలో నిలిచింది. 

46
Allu Arjun

హిందీ స్పీకింగ్ మార్కెట్ అర్బన్ (HSM urban) ప్రాంతంలో పుష్ప చిత్రానికి 4.35 టీవీఆర్ నమోదైంది. సూర్య వంశీ చిత్రాన్ని 2.7, రణ్వీర్ 83 చిత్రానికి 1. 7 టీవీఆర్ మాత్రమే నమోదయ్యాయి. 

56
pushpa

అలాగే  HSM pay రీజియన్ లో కూడా పుష్ప రికార్డు సృష్టించింది. పుష్ప చిత్రానికి 3.7 టీవీఆర్ నమోదు కాగా.. సూర్యవంశీ 3.1.. 83 చిత్రానికి 2. 1 టీవీఆర్ నమోదు అయ్యాయి. హెచ్ ఎస్ ఎం అర్బన్ అండ్ పే ప్రాతంలో కూడా సేమ్ సీన్ రిపీట్ ఐంది. పుష్ప జోరు ముందు అక్షయ్ కుమార్, రణ్వీర్ చిత్రాలు నిలబడలేకపోయాయి. ఇక్కడ పుష్ప 4.2 టీవీఆర్ నమోదు చేసుకోగా సూర్యవంశీ 1.6.. రణ్వీర్ 83 చిత్రం 1.07 వద్దే ఆగిపోయాయి. 

66

దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు నార్త్ లో పుష్ప మ్యానిలా ఎలా అల్లుకుని ఉందో అని. ఇటీవల కాలంలో కాస్త మాస్ టచ్ తో ఉండే తెలుగు సినిమాలకు నార్త్ లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రం నార్త్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories