అను ఇమ్మాన్యూల్ పై ఫైర్ అవుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్, నీకు హెడ్ వెయిట్ అంటూ...?

First Published | Oct 23, 2022, 11:44 PM IST

రాక రాక వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా.. అనవసరంగా ట్రోలర్స్ బారిన పడింది హీరోయిన్ అను ఇమ్మాన్యూయల్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఇంతకీ వారికి అను ఎందుకు కోపం తెప్పించింది. 
 


రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ లో  మీడియా ప్రతినిథిపై హీరోయిన్ అను ఇమ్మాన్యూల్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే బన్నీ ఫ్యాన్స్ కు ఈ విషయం కోపం తెప్పించిందట. ఆమె మాట్లాడిన మాటల్లో పొరపాట్లను పాయింట్ చేస్తూ.. ట్రోల్ చేస్తున్నారట. ఇంతకీ విషయం ఏంటంటే..? 
 

అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్న సినిమా ఊర్వశివో రాక్షసివో . ఈ సినిమాతో చాలా కాలం గ్యాప్ తరువాత అను తెలుగు తెరపై కనిపించబోతోంది. అటు శిరీష్ కూడా చాలా గ్యాప్ తరువాత స్క్రీన్ పై మెరవబోతున్నాడు. మరో విషయం ఏంటీ అంటే.. ఈ ఇద్దరు స్టార్స్ లవ్ లో ఉన్నారంటూ చాలా కాలంగా టాక్ గట్టిగా నడుస్తున్న వేళ... ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. 


Anu Emmanuel latest

ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా చాలా కాలం గ్యాప్ తీసుకుని రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ నవంబర్ 4న  థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతోంది. ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ ని పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో ఇమాన్యుల్ చాలా హాట్ గా కనిపించింది . అంతేకాదు ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అను హర్ట్ అయింది.. వెంటనే అతనిపై ఫైర్ అయ్యింది బ్యూటీ. 

గతంలో అల్లు అర్జున్ తో నా పేరు సూర్య సినిమాలో నటించింది అను ఇమ్మాన్యూయల్.. ప్రస్తుతం అల్లు శిరీష్ తో నటిస్తోంది. అయితే వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు అని పుకారు ఉన్న నేపథ్యంలో ఆమెకు ఓ ప్రశ్న ఎదురయ్యింది.  మీరు నా పేరు సూర్య నా ఊరు ఇండియాలో అల్లు అర్జున్ తో నటించారు. ఊర్వశివో రాక్షసివో  సినిమాలో తమ్ముడు శిరీష్ తో నటించారు.ఇద్దరిలో మీకు ఎవరు కన్వీనెంట్ అంటూ ప్రశ్నించారు మీడియా మిత్రులు. దాంతో అతనిపై  ఫైర్ అయిన అను... ఇలాంటి ప్రశ్నలు తప్పిస్తే మీ దగ్గర వేరే ప్రశ్నలు ఉండవా అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.  

ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ విషయంలో  రెస్పాండ్ అయ్యారు. మీడియా వాళ్లు  శిరిష్ తో అల్లు అర్జున్ ను శిరీష్ తో కంపేర్ చేసినప్పుడు  స్టార్ పొజిషన్లో  ఉన్న బన్నీ పేరు చెప్పడానికి ఏమైయ్యింది.. ఏ హీరోయిన్ అయినా ఈ విషయంలో  కళ్ళు మూసుకుని అల్లు అర్జున్ పేరు చెప్పేవారు.. నువ్వు ఎందుకు చెప్పలేక పోయావ్ అంటూ ఏకి పడేస్తున్నారు. 

anu emmanuel

అల్లు శిరీష్ .. ఏ విషయంలో అల్లు అర్జున్ దరిదాపుల్లో ఉండలేడు.. అటువంటిది ఈ విషయంలో అను ఏం చెప్పలేకపోవడం ఏంటీ.. బన్నీ పేరు చెప్పుంటే నీ లైఫ్ ఎక్కడికో వెళ్లిపోయిండేది. నీలాంటి హెడ్ వెయిట్ హీరోయిన్ మాకు వద్దు.. అందుకే నీకు ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేవు. ఇకనైనా మారు అంటూ క్లాస్ పీకుతున్నారు అల్లు ఫ్యాన్స్. అంతే కాదు బాయ్ కాట్ అను  ఇమ్మానుయేల్ అనే హాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. 

Latest Videos

click me!