ఖరీదైన ఇల్లు కొన్న అలియా భట్.. కాస్ట్ ఎంత? అక్కడ ఏం చేయబోతోంది?

First Published | Apr 25, 2023, 11:00 AM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. అక్కడే  తన వ్యాపారాన్ని కూడా ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. 
 

‘ఆర్ఆర్ఆర్’తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో అలియాకు సౌత్ లో మంచి క్రేజ్ పెరిగింది. వెంటనే ఇక్కడి నుంచి ఆఫర్లు వచ్చినా తన పెళ్లి, ప్రెగ్నెన్నీ కారణంగా ఓకే చెప్పలేకపోయిందని ప్రచారం జరిగింది. 
 

ప్రస్తుతం భర్త, బాలీవుడ్ అగ్ర హీరో రన్బీర్ కపూర్ (Ranbir Kapoor), కూతురు రాహా (Raha)తో కలిసి  హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. పెళ్లి తర్వాత కూడా కేరీర్ పైనే ఫోకస్ పెట్టింది.  మరోవైపు రన్బీర్ - అలియా జంటగా ఆయా ఈవెంట్లలో మెరుస్తూనే ఉన్నారు. ఇలా ఎప్పుడూ నెట్టింట వీరి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి..


తాజాగా అలియా భట్ కు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. బాంద్రాలోని ఖరీదైన పాలిహిల్ ప్రాంతంలో రూ. 37.80 కోట్ల  ఓ ఇంటిని కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇప్పటికే  ముంబైలో ఎనిమిది అంతస్థుల ఇంటిలో అలియా - రన్బీర్ నివాసం ఉంటున్నారు. 

అయితే, తాజాగా కొత్త ఇంటిని ఎందుకు కొన్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఇంటిలోనే  అలియా తన వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది. ప్రొడక్షన్ హౌస్ కోసమే ఇంటిని కొన్నారంటూ ప్రచారం. ఇందుకు స్టాంప్ డ్యూటీనే రూ.2.26 కోట్లు చెల్లించిందంట అలియా. ఇక రెండు చేతుల సంపాదనకు సిద్ధం అవుతోంది. 
 

మరోవైపు అలియా పేరు మీదున్న రెండు ఫ్లాట్స్ ను తన సోదరి షహీన్ కి గిఫ్ట్ గా అందించిన్నట్టు కూడా తెలుస్తోంది. దాని విలువ దాదాపు రూ.8 కోట్ల వరకు ఉంటుందని టాక్. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న అలియా ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. అలాగే నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టబోతుందని తెలుస్తోంది. 
 

అలియా భట్ ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన  విషయం తెలిసిందే. ఇక సౌత్ లో NTR30తో అలరిస్తుందని భావించిన కుదరలేదు. ఆ ఛాన్స్  జాన్వీ కపూర్ దక్కించుకుంది. అలియా మాత్రం మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యామిలీతో చాలా క్లోజ్ గా ఉంటోంది. దీంతో ఎప్పటికైనా తెలుగులో సినిమా చేసే ఛాన్స్ ఉందోమోనని అంటున్నారు. ప్రస్తుతం ‘రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని’, హాలీవుడ్ ఫిల్మ్ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ లో నటిస్తోంది.
 

Latest Videos

click me!