ఈరోజు ఎపిసోడ్ లో మల్లిక,జెస్సి రిపోర్ట్స్ తీసుకుని ఎలా అయినా ఇందులో ఏముందో తెలుసుకోవాలి నిజం బయట పెట్టాలి అనుకుంటూ జెస్సి దగ్గరికి వెళ్తుండగా అది చూసి జానకి షాక్ అవుతుంది. అప్పుడు జానకి ఎలా అయినా మల్లికను ఆపాలి అనుకుని అక్కడికి వెళ్తుండగా ఇంతలో జ్ఞానాంబ మల్లికను పిలవడంతో రిపోర్ట్స్ ని మల్లిక ఒకచోట దాచిపెట్టి అక్కడికి వెళ్తుంది. అది చూసిన జానకి మల్లిక అటు వెళ్లగానే వెంటనే ఆ పేపర్ ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. జ్ఞానాంబ దగ్గరికి వెళ్లిన మల్లిక చెప్పండి అత్తయ్య గారు అని అడగడంతో జరిగినవి వాటి ఆలోచించకు వెళ్లి పడుకో అనడంతో సరే అత్తయ్య గారు అని మల్లిక అక్కడికి వెళ్లిపోతుంది.