'లెనిన్' గా అక్కినేని అఖిల్!? డైరక్టర్ ఎవరంటే...

First Published | Aug 7, 2024, 8:36 AM IST

అఖిల్ అక్కినేని (Akhil Akkineni)కు అర్జెంట్ గా హిట్ కావాలి.  'ఏజెంట్' రిలీజ్ తర్వాత అది డెస్పరేషన్ గా మారిపోయింది.   

aKHIL AKKINENI


అఖిల్ కెరీర్ ప్రారంభం నుంచి చెప్పుకోదగ్గ హిట్ అనేది పడలేదు. జానర్స్ మార్చి చేస్తున్నా పెద్ద డైరక్టర్స్ తో చేసినా వర్కవుట్ కాలేదు.  చివరగా ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏజెంట్ మూవీ సైతం  బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఏజెంట్  వచ్చి ఏడాది దాటినా ఇంతవరకూ అక్కినేని వారసుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించలేదంటే అఖిల్ పరిస్దితి ఏమిటో ఊహించవచ్చు. అయితే ఈ సారి కథలపై దృష్టి పెట్టి సాలిడ్ కొట్టాలని ఫిక్సై రెండు ప్రాజెక్టులు ఓకే చేసారట. అందులో ఒకటి త్వరలో ప్రారంభం కానుందని సమాచారం.,
 


 అఖిల్ అక్కినేని (Akhil Akkineni)కు అర్జెంట్ గా హిట్ కావాలి.  'ఏజెంట్' రిలీజ్ తర్వాత అది డెస్పరేషన్ గా మారిపోయింది.   ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఎవరితో? అనే ప్రశ్న మొదలైంది.   కొత్తగా కమిటైన ప్రాజెక్టు వివరాల్లోకి వెళితే.. 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ ఒక సినిమా చేయనున్నాడు. నాగార్జున, నాగ చైతన్య కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాకి 'లెనిన్' అనే టైటిల్ ని ఖరారు చేశారని టాక్.   'లెనిన్' టైటిల్ తో అఖిల్ సినిమా చేయనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.


 
చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ ఇది అని తెలుస్తోంది. అలాగే ఈ కథని మొదట రవితేజ తో చేద్దామనుకుని ప్రయత్నించారట. రవితేజ దగ్గర కొద్ది రోజులు ఆగి, స్క్రిప్టు మార్పులు చేసినా వర్కవుట్ కాదని, ఎవరైనా యంగ్ హీరో అయితే బెస్ట్ అని డైరక్టర్ కు చెప్పటంతో అఖిల్ దగ్గరకు వెళ్లారని అంటున్నారు. అఖిల్ కోసం వరసగా నాగ్ కథలు వింటున్నారు. అందులో భాగంగా విని ఇమ్మీడియట్ గా ఓకే చేసారని తెలుస్తోంది.


మనం ఎంటర్ ప్రైజస్ బ్యానర్ పై నాగ్, నాగచైతన్య నిర్మించే  ఈ చిత్రం చిత్తూరు నేపధ్యంలో సాగే రూరల్ డ్రామా అని తెలుస్తోంది. ఫన్, యాక్షన్ కు ప్రయారిటి ఇచ్చి కథను నడించారని, ఖచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొడతారని నాగ్ నమ్మకంగా ఉన్నారట. ఈ మేరకు వెంటనే కథను లాక్ చేసి సినిమా ప్రారంభిస్తున్నారని వినికిడి. 
 


ఇదిలా ఉండగదా అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చేయనున్నట్లుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. 'Akhil 6' ఒక వార్ బ్యాక్ డ్రాప్ మూవీ అని టాక్. గతంలో రాధేశ్యామ్, సాహో సినిమాలకి వర్క్ చేసిన అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతోనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. దీనికి 'ధీర' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.  


ఈ క్రమంలో యువి క్రియేషన్స్ సంస్థలో అఖిల్ తో సినిమా అనే టాక్ బయిటకు వచ్చింది! ఇప్పుడు ఆ పనులు ముమ్మరంగా జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ప్రభాస్ 'సాహో' చిత్రానికి దర్శకత్వ శాఖలో పని చేసిన అనిల్ కుమార్ దర్శకుడు. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగులో జరుగుతున్నాయని తెలిసింది.ఈ క్రమంలో ఓ వార్త బయిటకు వచ్చింది. ఈ సినిమా స్క్రిప్టు విషయంలో రాజమౌళి చేయి చేసుకుంటున్నట్లు ఆ వార్త సారాంశం.

Akhil -Vijay


#SSRajamouli కుమారుడు కార్తికేయ, అఖిల్ క్లోజ్ ప్రెండ్స్. వీరిద్దరు కలిసి అఖిల్ సినిమా ఎంట్రీకు ముందే ఓ షార్ట్ ఫిల్మ్ కూడా చేసారు. ఆ షార్ట్ ఫిల్మ్ కు కార్తికేయ డైరక్టర్. ఆ షార్ట్ ఫిల్మ్ బయిటకు వదలలేదు. అది ప్రక్కన పెడితే ఇప్పుడు కార్తికేయకు, అఖిల్ కు ఈ దర్శకుడు అనీల్ మంచి స్నేహితుడుట. దాంతో ఎలాగైనా వీరంతా కలిసి ఈ సినిమాని హిట్ కొట్టాలనుకుంటున్నారు. అందుకోసం కార్తికేయ దగ్గరుండి స్క్రిప్టు వర్క్ లో ఇన్వాల్వ్ అవుతున్నారట. అంతేకాదు తన తండ్రి రాజమౌళి ని సైతం రిక్వెస్ట్ చేసి సీన్ లోకి తెచ్చారని సమాచారం. ఆయన ఆధ్వర్యంలో స్క్రిప్టు మార్పులు జరుగుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. 

 
 ఈ సినిమా ఫాంట‌సీ జాన‌ర్ లో తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది. అలాగే ఈ  సినిమాకు 'ధీర' టైటిల్ ఫిక్స్ చేశారని తెలిసింది. అందులో కథానాయికగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) అఖిల్ సరసన నటించనున్నారట. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్ వేల్యూస్ గురించి తెలిసిందే. భారీ బడ్జెట్ ఫిక్స్ అనుకోవాలి.  
 

Latest Videos

click me!