బార్డర్‌ క్రాస్‌ చేసిన డస్కీ బ్యూటీ ఐశ్వర్యా రాజేష్‌.. ఈ రేంజ్‌లో రెచ్చిపోయిందేంటి?.. వేరే లెవల్‌

First Published | Jun 30, 2021, 5:53 PM IST

డస్కీ బ్యూటీ ఐశ్వర్యా రాజేష్‌ నటనకు ప్రయారిటీ ఉన్న సినిమాల్లో నటిస్తూ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. గ్లామర్‌ విషయంలో ఎన్నో బారియర్స్ పెట్టుకున్న ఈ భామ ఇప్పుడు ఒక్కసారిగా అన్నీ బార్డర్స్ క్రాస్‌ చేసినట్టే కనిపిస్తుంది.
 

తెలుగు ఫ్యామిలీకి చెందిన ఈ తమిళ సోయగం తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అందాల ఆరబోతకి అతీతంగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. తనదైన నటనతో బలమైన పాత్రలను రక్తికట్టిస్తూ ఆడియెన్స్ ని మెస్మరైజ్‌ చేస్తుంది ఐశ్వర్యా రాజేష్‌.

హోంమ్లీ బ్యూటీగా పేరుతెచ్చుకున్న ఈ డస్కీ బ్యూటీ గ్లామర్‌ విషయంలో బార్డర్స్ క్రాస్‌ చేసినట్టే కనిపిస్తుంది. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న ఫోటో షూట్‌ పిక్స్ షాక్‌కి గురి చేస్తున్నాయి.
ఏంజెల్‌ లాగా రెడీ అయి హోయలు పోయింది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల గుండెల్ని గుళ్ల చేసేస్తుందీ అందాల భామ. అయితే ఓ జ్యూవెల్లరీ బ్రాండ్‌ప్రమోషనల్‌లో భాగంగా ఐశ్వర్యా ఇలా హాట్‌ పోజులిచ్చింది.
ఐశ్వర్య సెక్సీ పోజులు ఇప్పుడు సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తుండటం విశేషం. కసిగా చూస్తూ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదు ఐశ్వర్య. లేటెస్ట్ పిక్స్ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి.
చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన ఐశ్వర్య రాజేష్‌ 2010లో `నీతన అవన్‌` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ కెరీర్‌ని బిల్డ్ చేసుకున్న ఐశ్వర్య విజయ్‌ సేతుపతితో చేసిన `రమ్మీ`, `పన్నైయరుమ్‌ పద్మియుమ్‌` చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది.
విభిన్న కథా చిత్రాలు, బలమైన పాత్ర కలిగిన సినిమాలు చేస్తూ నటిగా తానేంటో నిరూపించుకుంది. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది.
`కౌసల్య కృష్ణమూర్తి` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. గతేడాది `వరల్డ్ ఫేమస్‌ లవర్‌` చిత్రంలోనూ విజయ్‌ దేవరకొండతో కలిసి నటించి మంచి మార్కులు కొట్టేసింది.
ఇప్పుడు నానితో `టక్‌ జగదీష్‌` చిత్రంలో నటిస్తుంది. `రిపబ్లిక్‌`, `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇలా తెలుగు, తమిళం, మలయాళం చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉంది ఐశ్వర్య.

Latest Videos

click me!