రౌడీ సినిమాలో సమంత ఐటం సాంగ్... ఈసారి రచ్చ మామూలుగా ఉండదా..?

First Published | Jan 23, 2022, 5:45 PM IST

సమంత ఐటెమ్‌ సాంగ్‌లకు కేరాఫ్‌గా మారబోతుంది. ముఖ్యంగా పాన్‌ ఇండియా చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్‌లంటే ఇప్పుడు అందరి చూపు సమంత మీదే ఉందా? లేటెస్ట్ ఈ బ్యూటీ మరో ఐటెమ్‌ సాంగ్‌ చేయబోతుందనే వార్త ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. 

స్టార్‌ హీరోయిన్లు ఐటెమ్‌ సాంగ్‌లు చేయడం ఇటీవల ట్రెండ్ గా మారింది. ఆ ట్రెండ్‌కి క్రేజ్‌ని తీసుకొచ్చింది సమంత. ఆమె ఓ వైపు స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తూనే ఉంది. తెలుగు చిత్రాల నుంచి అంతర్జాతీయ చిత్రాల వరకు వరుసగా సినిమాలు చేస్తుంది. పాన్‌ ఇండియాని మించి ఇంటర్నేషనల్‌ చిత్రాల్లోనూ భాగమవుతూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది. ఈ క్రమంలో లేటెస్ట్ గా సమంత గురించిన ఓ వార్త ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

సమంత.. ఇటీవల ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన `పుష్ప` చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌ చేసింది. `ఊ అంటావా.. ఊఊ అంటావా` అంటూ సాగే ఈ మాస్‌ ఐటెమ్‌ సాంగ్‌ ఓ రేంజ్‌లో ఊపేసింది. సినిమాకి పెద్ద అసెట్గా మారింది. సినిమా హైప్‌ పెంచడంలో కీలక భూమిక పోషించింది. బాలీవుడ్‌లో ఈ పాట ఎంతగా ఉర్రూతలూగించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 


సమంతకి `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` అనే వెబ్‌ సిరీస్‌ హిందీలో మంచి మార్కెట్ ఏర్పాటు చేసింది. ఈ బ్యూటీకి అక్కడ ఇప్పుడున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. దాన్ని `పుష్ప`లో ఐటెమ్‌ సాంగ్‌ మరింత పెంచింది. సుకుమార్‌తో `రంగస్థలం` చిత్రంతో ఉన్న అనుబంధంతో ఈ సాంగ్‌కి ఒప్పుకుంది సమంత. ఈ పాట కూడా యూట్యూబ్‌లో టాప్‌ వ్యూస్‌ని సాధించింది. 
 

అయితే ఇప్పుడు మరో ఐటెమ్‌ సాంగ్‌ సమంతని వరించిందని తెలుస్తుంది. `పుష్ప`లో ఆమె చేసిన పాటని చూసిన మేకర్స్ మరో పాన్‌ ఇండియా చిత్రానికి స్పెషల్‌ సాంగ్‌ కోసం సంప్రదించారట. ఆ సినిమా ఎవరో కాదు, విజయ్‌ దేవరకొండ, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న `లైగర్‌` స్పెషల్‌ సాంగ్‌ కోసం సమంతని సంప్రదించారని తెలుస్తుంది. 

విజయ్‌ దేవరకొండ, సమంత కలిసి `మహానటి`లో నటించారు. వీరిద్దరు జోడీగా కనిపించారు. సమంత.. సావిత్రి జీవితాన్ని స్టడీ చేసే రిపోర్టర్‌గా, విజయ్‌ దేవరకొండ ఫోటోగ్రాఫర్‌గా నటించారు. ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. సావిత్రి కథకి పారలల్‌గా ఈ స్టోరీ కూడా ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రశంసలందుకుంది. ఆ మ్యాజిక్‌ని `లైగర్‌లో రిపీట్‌ చేయాలని భావిస్తున్నారట పూరీ. 

అయితే ఈ చిత్రానికి సమంత ఓకే చెప్పిందని సమాచారం. కాకపోతే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మరో పాన్‌ ఇండియా చిత్రంలో సమంత ఐటెమ్‌ సాంగ్‌ అని, పాన్‌ ఇండియా రేంజ్‌లో ఊపేయడం ఖాయమని అంటున్నారు నెటిజన్లు. 

ఇక సమంత నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం కెరీర్‌ పరంగా జోరు పెంచింది. వరుసగా విభిన్న కథా చిత్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం సమంత.. తెలుగులో `శాకుంతలం` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్`, అలాగే పాన్‌ ఇండియా చిత్రం `యశోద`తోపాటు డ్రీమ్‌ వారియర్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తుంది. అలాగే ఓ ఇంటర్నేషనల్‌ చిత్రంలోనూ నటిస్తుంది సమంత. 

Latest Videos

click me!